Meta: ఇకపై ఇన్‌స్టా, ఎఫ్‌బీలో వారికి ఆ కంటెంట్ కనిపించదు.! వీడియో.
సోషల్ మీడియా వినియోగం ఓ రేంజ్‌లో పెరిగింది. మారుతోన్న కాలానికి అనుగుణంగా సోషల్ మీడియాలో సైట్స్‌లో ఫీచర్స్ మారుతూ, యూజర్లను మరింత ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రమంలోనే చిన్నారులు సైతం సోషల్ మీడియాకు అలవాటు పడుతున్నారు. గంటలసేపు స్మార్ట్ ఫోన్‌తో గడిపేస్తున్నారు. అయితే ఇదే సమయంలో అశ్లీల కంటెంట్ పెద్ద సమస్యగా మారిపోయింది. చిన్నారులకు తెలియకుండానే అడల్ట్ కంటెంట్‌ను చూసే పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఇలాంటి కంటెంట్‌కు చెక్ పెట్టేందుకు మెటా కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై మెటా యాజమాన్యంలోని ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లో సెన్సిటివ్ కంటెంట్‌ను చిన్నారులు చూడకుండా చేయడానికి కొన్ని టూల్స్‌ను పరిచయం చేస్తోంది.
సోషల్ మీడియా వినియోగం ఓ రేంజ్‌లో పెరిగింది. మారుతోన్న కాలానికి అనుగుణంగా సోషల్ మీడియాలో సైట్స్‌లో ఫీచర్స్ మారుతూ, యూజర్లను మరింత ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రమంలోనే చిన్నారులు సైతం సోషల్ మీడియాకు అలవాటు పడుతున్నారు. గంటలసేపు స్మార్ట్ ఫోన్‌తో గడిపేస్తున్నారు. అయితే ఇదే సమయంలో అశ్లీల కంటెంట్ పెద్ద సమస్యగా మారిపోయింది. చిన్నారులకు తెలియకుండానే అడల్ట్ కంటెంట్‌ను చూసే పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఇలాంటి కంటెంట్‌కు చెక్ పెట్టేందుకు మెటా కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై మెటా యాజమాన్యంలోని ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లో సెన్సిటివ్ కంటెంట్‌ను చిన్నారులు చూడకుండా చేయడానికి కొన్ని టూల్స్‌ను పరిచయం చేస్తోంది. మెటా ప్లాట్‌ఫారమ్‌లలో చిన్నారులు ఏదైనా సెన్సిటివ్ కంటెంట్ కోసం సెర్చ్ చేస్తే, అలాంటి వాటికి బదులుగా.. ఈ సబ్జెక్ట్‌లో సహాయం కోరమని మెసేజ్ వస్తుంది. ‘సీ లెస్ సెన్సిటివ్ కంట్’ అనే ఆప్షన్‌ను టర్న్ ఆన్ చేసుకోవడం ద్వారా చిన్నారులకు కంటెంట్‌ను కంట్రోల్ చేయొచ్చు. ముఖ్యంగా రీల్స్, ఎక్స్‌ప్లోర్, సూసైడ్, సెల్ఫ హార్మ్ వంటి వాటికి సంబంధించిన కంటెంట్‌ను చిన్నారుల వయసు ప్రకారం చూపిస్తామని మెటా తెలిపింది. ఇప్పటికే మెటాకు చెందిన సోషల్ మీడియా యాప్స్ ప్రజలను ఆకర్షించేందుకు రకరకాల కంటెంట్‌ను చూపిస్తున్నాయని, వాటివల్ల దుష్ప్రభావం పడుతుందని యూరప్, యూఎస్ ప్రభుత్వాల నుంచి ఒత్తిడి ఎదుర్కోంటోంది. ఇందులో భాగంగానే ఈ కొత్త టూల్స్‌ను మెటా ప్రవేశపెట్టింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

