Aditya-L1: పరిశోధనలు ప్రారంభించిన ఆదిత్య ఎల్‌1 సూర్యుడి దిశగా ప్రయాణం !!

Aditya-L1: పరిశోధనలు ప్రారంభించిన ఆదిత్య ఎల్‌1 సూర్యుడి దిశగా ప్రయాణం !!

Phani CH

|

Updated on: Sep 20, 2023 | 9:50 AM

సూర్యుడిపై పరిశోధనలకు పంపించిన ఆదిత్య ఎల్‌1 డేటాను సేకరించడం ప్రారంభించింది. అది భూమికి దాదాపు 50,000 కిలోమీటర్లకు పైగా దూరంలో సూప్ర థర్మల్‌, ఎనర్జిటిక్‌ అయాన్స్‌, ఎలక్ట్రాన్స్‌కు సంబంధించిన డేటాను నమోదు చేస్తోంది. ఇది భూమి చుట్టూ ఉన్న పార్టికల్స్‌ ప్రవర్తనను విశ్లేషించడానికి ఉపయోగపడుతుంది. వాతావరణం మారే కొద్దీ శక్తి కణాల ప్రవర్తనలో మార్పులు ఉంటున్నట్లు ఆదిత్య ఎల్‌1లోని స్టెప్స్‌ స్పెక్ట్రోమీటర్‌ గుర్తించింది.

సూర్యుడిపై పరిశోధనలకు పంపించిన ఆదిత్య ఎల్‌1 డేటాను సేకరించడం ప్రారంభించింది. అది భూమికి దాదాపు 50,000 కిలోమీటర్లకు పైగా దూరంలో సూప్ర థర్మల్‌, ఎనర్జిటిక్‌ అయాన్స్‌, ఎలక్ట్రాన్స్‌కు సంబంధించిన డేటాను నమోదు చేస్తోంది. ఇది భూమి చుట్టూ ఉన్న పార్టికల్స్‌ ప్రవర్తనను విశ్లేషించడానికి ఉపయోగపడుతుంది. వాతావరణం మారే కొద్దీ శక్తి కణాల ప్రవర్తనలో మార్పులు ఉంటున్నట్లు ఆదిత్య ఎల్‌1లోని స్టెప్స్‌ స్పెక్ట్రోమీటర్‌ గుర్తించింది. ఈ విషయాన్ని ఇస్రో ఎక్స్‌ వేదికగా తెలిపింది. ఆదిత్య ఎల్‌1 19న కీలక దశకు చేరుకుంటుంది. దీని భూప్రదక్షిణ దశ ముగియనుంది. 19 తెల్లవారుజామున రెండు గంటల సమయంలో సూర్యుడి దిశగా ప్రయాణం ప్రారంభించనుంది. ఈ క్రమంలో ఇది సన్‌-ఎర్త్‌ లాగ్రేంజ్‌ 1కు చేరుకుంటుంది. ఇది భూమికి సుమారు 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ పాయింట్‌లో సూర్యుడు, భూమి గురత్వాకర్షణ శక్తులను ఉపయోగించుకొని ఏదైనా స్థిరంగా ఉండవచ్చు. ఇప్పటి వరకు ఐదు లాగ్రేంజ్‌ పాయింట్లను గుర్తించారు. వీటిల్లో భారత్‌కు చెందిన ఆదిత్య ఎల్‌1 తొలి లాగ్రేంజ్‌ పాయింట్‌కు వెళుతోంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బ్యాక్టీరియా సోకిన చేప తిని.. కాళ్లూచేతులు పోగొట్టుకున్న మహిళ !!

దొంగ చేతికి తాళాలు అంటే ఇదేనేమో !! సీసీ కెమెరాల్లో రికార్డ్ అయిన చోరీ దృశ్యాలు

Sampoornesh Babu: మార్టిన్ లూథర్ కింగ్ తో మళ్లీ రేసులోకి సంపూర్ణేశ్ బాబు

Taapsee Pannu: లగ్జరీ కారును కొన్న తాప్సీ.. ధర తెలిస్తే షాక్ !!