Twitter: మరో షాకిచ్చిన ఎలాన్ మస్క్.. ఇకపై డబ్బు చెల్లించాల్సిందే..! పూర్తి వివరాలు..
ట్విట్టర్ బాస్ ఎలాన్ మస్క్ ఏం చేసినా సంచలనమే. గతేడాది ప్రముఖ మైక్రో బ్లాగింగ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్ టేకోవర్ చేసిన మస్క్.. ఇక అప్పటి నుంచి సంస్థలో సమూల మార్పులు చేస్తూ వస్తున్నారు. చివరికి ట్విట్టర్ పేరును ఎక్స్‌గా మార్చేశారు. పిట్ట స్థానంలో ఎక్స్ లోగోను తీసుకొచ్చారు. ఇటీవలే సంస్థ ఆదాయం పెంచుకోవడానికి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకూ ట్వీట్ డెక్ సర్వీసులు ఉచితం.. కానీ
ట్విట్టర్ బాస్ ఎలాన్ మస్క్ ఏం చేసినా సంచలనమే. గతేడాది ప్రముఖ మైక్రో బ్లాగింగ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్ టేకోవర్ చేసిన మస్క్.. ఇక అప్పటి నుంచి సంస్థలో సమూల మార్పులు చేస్తూ వస్తున్నారు. చివరికి ట్విట్టర్ పేరును ఎక్స్‌గా మార్చేశారు. పిట్ట స్థానంలో ఎక్స్ లోగోను తీసుకొచ్చారు. ఇటీవలే సంస్థ ఆదాయం పెంచుకోవడానికి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకూ ట్వీట్ డెక్ సర్వీసులు ఉచితం.. కానీ వాటిని పెయిడ్ సర్వీసులుగా మారుస్తున్నట్లు వెల్లడించారు. తాజాగా ట్విట్టర్ యూజర్లందరికీ గట్టి షాక్ ఇస్తూ సంచలన నిర్ణయానికి తెరతీశారు. మస్క్.. ఇప్పటికే బ్లూ టిక్ సబ్‌స్క్రిప్షన్ సేవను తీసుకొచ్చారు. అధికారిక, ధృవీకరణ ట్విట్టర్ అకౌంట్లకు చిహ్నంగా ఉన్న బ్లూటిక్‌కు చందా విధానాన్ని అమలు చేస్తున్నారు. తాజాగా త్వరలోనే ట్విట్టర్ ఖాతాదారులందరి నుంచి నెలవారీ సబ్‌స్క్రిప్షన్ ఫీజు వసూలు చేసే యోచనలో ఉన్నట్లు మస్క్ వెల్లడించారు. ప్రతి యూజర్ నుంచి ఎంతో కొంత ఫీజు వసూలు చేయాలనే ప్రదిపాదనలో ఉన్నట్లు తెలిపారు. అయితే, ఎంత ఫీజు వసూలు చేస్తారన్న దానిపై మాత్రం ఆయన స్పష్టతనివ్వలేదు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..