Vijay Mallya-Gayle: గేల్‌తో ఫోటో షేర్ చేసిన విజయ్ మాల్యా .. వైరల్‌గా మారిన పిక్..
ఒకరు లికర్ కింగ్.. మరొకరు యూనివర్స్ బాస్.. ఈ లికర్ కింగ్ ఒకప్పుడు ఈ యూనివర్స్ బాస్‌ను తన టీమ్‌లోకి తీసుకున్నాడు. అతడు వచ్చిన తర్వాతే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు..
ఒకరు లికర్ కింగ్.. మరొకరు యూనివర్స్ బాస్.. ఈ లికర్ కింగ్ ఒకప్పుడు ఈ యూనివర్స్ బాస్‌ను తన టీమ్‌లోకి తీసుకున్నాడు. అతడు వచ్చిన తర్వాతే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రాత మారింది. ఇన్నాళ్ల తర్వాత ఈ ఇద్దరూ ఒక్క చోట చేరడంపై ఇంటర్నెట్‌లో పెద్ద చర్చే నడుస్తోంది. విజయ్ మాల్యా తాజాగా తన ట్విట్టర్‌లో క్రిస్ గేల్ ఫోటోను షేర్ చేశాడు. ఒకప్పుడు ఐపీఎల్‌లో బెంగుళూరు జట్టుకు ఓనర్‌గా మాల్యా ఉన్న సమయంలో.. ఆ జట్టుకే క్రిస్ గేల్ ఆడేవాడు. 2011 నుంచి 2017 సీజన్ వరకు రాయల్ ఛాలెంజెర్స్ బెంగుళూరు జట్టుకు యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ ప్రాతినిధ్యం వహించాడు. నిజానికి క్రిస్ గేల్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్‌లోకి వచ్చిన తర్వాతే ఐపీఎల్‌లో పరుగుల సునామీ అంటే ఏంటో ప్రపంచానికి తెలిసొచ్చింది. తనను తాను యూనివర్స్ బాస్‌గా చెప్పుకున్న గేల్.. ఆర్సీబీ తరఫున ఎన్నో మరుపురాని ఇన్నింగ్స్ ఆడాడు. అందులో 30 బాల్స్‌లోనే సెంచరీ చేసిన ఇన్నింగ్స్ కూడా ఉంది. ఇలాంటి ఇన్నింగ్స్‌తోనే డివిలియర్స్‌తో కలిసి ఐపీఎల్ తొలి హాల్ ఆఫ్ ఫేమ్‌లోకి ఎక్కిన ప్లేయర్‌గా క్రిస్ గేల్ నిలిచాడు.గేల్‌ను కలిసిన సందర్భంగా మాల్యా ఇవే జ్ఞాపకాలను పంచుకున్నాడు. తన ట్విటర్‌లో గేల్‌తో కలిసి ఫొటోను షేర్ చేస్తూ.. “నా మంచి స్నేహితుడు, యూనివర్స్ బాస్ క్రిస్టొఫర్ హెన్రీ గేల్‌తో కలవడం చాలా ఆనందంగా ఉంది” అని మాల్యా అన్నారు. కాగా.. లండన్‌లో తలదాచుకున్న అతన్ని ఇండియాకు అప్పగించాల్సిందిగా 2019లోనే యూకే కోర్టు ఆదేశించినా.. ఇంకా అతన్ని దేశానికి తీసుకురాలేకపోయారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Collector-student: కలెక్టరమ్మకూ తప్పని తిప్పలు.. క్లాస్ రూమ్‌లోకి వెళ్లనని తనయుడు మారం..
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

