Watch Video: ఇదెక్కడి మాస్ బౌలింగ్‌రా మావా.. షాకవుతోన్న నెటిజన్లు.. వైరల్ వీడియో
పుణెలో జరుగుతున్న మహిళల T20 ఛాలెంజ్ 2022లో భాగంగా రెండవ మ్యాచ్‌లో, వెలాసిటీ స్పిన్నర్ మాయా సోనావానే బౌలింగ్ యాక్షన్ నెటిజన్లను షాక్ అవుతున్నారు.
హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని సూపర్‌నోవాస్(Supernovas)తో జరిగిన మ్యాచ్‌లో వెలాసిటీ(Velocity) తరపున అరంగేట్రం చేసిన సోనవానే(Maya Sonawane) రెండు ఓవర్లు బౌలింగ్ చేసి 19 పరుగుల ఇచ్చింది. అయితే, ఆమె బౌలింగ్ యాక్షన్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. కొంతమంది దీనిని ఐపీఎల్‌లో ఒకప్పుడు గుజరాత్ లయన్స్‌కు ప్రాతినిధ్యం వహించిన శివిల్ కౌశిక్‌తో పోల్చగా, మరికొందరు దక్షిణాఫ్రికా మాజీ అంతర్జాతీయ ఆటగాడు పాల్ ఆడమ్స్‌ను గుర్తుచేసుకున్నారు. ఇంకొందరు ఇలాక్కూడా బౌలింగ్ చేస్తారా అంటూ ఆశ్చర్యపోతున్నారు. 23 ఏళ్ల సోనావానే మహారాష్ట్రకు ప్రాతినిధ్యం వహించిన సీనియర్ మహిళల టీ20 పోటీలో అద్భుతమైన ప్రదర్శన చేసింది. ఆమె ఎనిమిది మ్యాచ్‌లలో 11 వికెట్లు పడగొట్టింది. కేవలం ఆరు ఎకానమీ రేటులో పరుగులు ఇచ్చింది.
కాగా, పుణెలో జరుగుతున్న మహిళల T20 ఛాలెంజ్ 2022లో భాగంగా MCA స్టేడియంలో దీప్తి శర్మ నేతృత్వంలోని వెలాసిటీ జట్టు ఏడు వికెట్ల తేడాతో సూపర్‌నోవాస్‌పై విజయం సాధించింది. సోమవారం రాత్రి ట్రైల్‌బ్లేజర్స్‌పై 49 పరుగుల తేడాతో విజయం సాధించి టోర్నమెంట్‌ను ప్రారంభించిన సూపర్‌నోవాస్.. మొదట బ్యాటింగ్ చేసి, నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 150 పరుగులు సాధించింది. అనంతరం బ్యాటింగ్ చేసిన వెలాసిటీ జట్టు కేవలం 18.2 ఓవర్లలో కేవలం మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. మూడో, చివరి లీగ్ మ్యాచ్‌లో వెలాసిటీ గురువారం సాయంత్రం అదే వేదికపై ట్రైల్‌బ్లేజర్స్‌తో తలపడుతుంది.
Debut for 23 year old leg spinner from Maharashtra, Maya Sonawane#My11CircleWT20C#WomensT20Challenge2022 pic.twitter.com/IRylJ62EGx
— WomensCricCraze?( Womens T20 Challenge) (@WomensCricCraze) May 24, 2022