AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: బ్యాట్స్‌మెన్‌ను భయపెట్టిన పొలార్డ్.. అలా బ్యాటింగ్ చేస్తావా అంటూ.. వైరల్ వీడియో

Trinidad T10 Blast: విండీస్ సహచరుడు నికోలస్ పూరన్‌పై కీరన్ పొలార్డ్ ఆఫ్ స్పిన్ బౌలింగ్‌లో కనిపించడంతో నెట్టింట్లో తెగ వైరలవుతున్నాడు.

Watch Video: బ్యాట్స్‌మెన్‌ను భయపెట్టిన పొలార్డ్.. అలా బ్యాటింగ్ చేస్తావా అంటూ.. వైరల్ వీడియో
Kieron Pollard Bowls Off Spin Viral Video
Venkata Chari
|

Updated on: Mar 04, 2022 | 11:34 AM

Share

కీరన్ పొలార్డ్(Kieron Pollard) ఆధునిక క్రికెట్‌లో అత్యుత్తమ ఆల్ రౌండర్‌లలో ఒకరిగా పేరుగాంచిన సంగతి తెలిసిందే. భారీ సిక్సర్‌లను కొట్టగల అతని సామర్థ్యాలు, పొట్టి ఫార్మాట్‌లో తుఫాన్ బ్యాట్స్‌మెన్‌గా మార్చాయి. అయితే బ్యాట్‌తోనే కాదు బంతితోను వెస్టిండీస్ కెప్టెన్ సమానంగా శక్తివంతమైనవాడు. 34 ఏళ్ల ఈ మీడియం పేసర్ బౌలింగ్‌లోనూ ఆకట్టుకుంటాడనడంలో సందేహం లేదు. అయితే తాజాగా ట్రినిడాడ్ టీ10 బ్లాస్ట్ లీగ్‌(Trinidad T10 Blast)లో తన బౌలింగ్‌తో నెట్టింట్లో నిలిచాడు. లెదర్‌బ్యాక్ జెయింట్స్ వర్సెస్ స్కార్లెట్ ఐబిస్ స్కార్చర్స్ మధ్య ఇటీవల జరిగిన ఓ మ్యాచ్ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరలవుతోంది(Viral Video).

మ్యాచ్ సందర్భంగా విండీస్ సహచరుడు నికోలస్ పూరన్‌పై పొలార్డ్ ఆఫ్ స్పిన్ బౌలింగ్ చేయడం ఈ వీడియోలో చూడొచ్చు. పొలార్డ్ బౌలింగ్ చేసేందుకు సిద్ధమైనప్పుడు ఎడమచేతి వాటం బ్యాటర్ కూడా తనదైన శైలిలో స్పందించి, ఎటాక్‌కు సిద్ధమవడాన్ని కూడా ఈ వీడియోలో చూడొచ్చు.

అయితే, పొలార్డ్ వైఖరిలో మార్పును గమనించిన నికోలస్ పూరన్.. తన బ్యాటింగ్‌ను మార్చేందుకు ప్రయత్నించి రైట్ హ్యాండ్‌తో ఎటాకింగ్‌కు సిద్ధమయ్యాడు. అయితే ఇది గమనించిన పొలార్డ్ బౌలింగ్ చేయకుండా మధ్యలోనే ఆగిపోయాడు. దీంతో పొలార్డ్, బ్యాట్స్‌మెన్ పూరన్‌ను భయపెట్టేందుకు ప్రయత్నించాడు. ఈమేరకు షాడో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు వికెట్ కీపర్‌కి బంతిని విసిరి, పూరన్ వైపు అలానే చూస్తూనే ఉన్నాడు. ఆ తరువాత పొలార్డ్ నాన్-స్ట్రైకర్స్ ఎండ్‌లో నిలబడి న్న పూరన్‌ను మన్కడ్ చేయడానికి ప్రయత్నించాడు. అయితే ఈ మ్యాచులో స్కార్లెట్ ఐబిస్ స్కార్చర్స్‌ను 9 వికెట్ల తేడాతో ఓడించి లెదర్‌బ్యాక్స్ విజయం సాధించింది.

మొదట బ్యాటింగ్ చేసిన స్కార్చర్స్ తమ 10 ఓవర్లలో 128/3 పరుగులు చేసింది. పొలార్డ్ 14 బంతుల్లో 27 పరుగులు చేశాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన పూరన్ 37 బంతుల్లో 101 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఇందులో 6 ఫోర్లు, 10 సిక్సులు ఉన్నాయి. అయితే, బంతితో, పొలార్డ్ తన రెండు ఓవర్లలో 21 పరుగులు ఇచ్చాడు.

Also Read: Watch Video: టెస్టుల్లో విరాట్ కోహ్లీ స్పెషల్ ‘సెంచరీ’.. సన్మానించిన రాహుల్ ద్రవిడ్‌

IND vs SL, 1st Test, Day 1 Live Score: రెండో వికెట్ కోల్పోయిన టీమిండియా.. మయాంక్ ఔట్.. స్కోరెంతంటే?