Sania Mirza: విడాకుల తరువాత తొలిసారి స్పందించిన సానియా మీర్జా.!
పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌తో విడాకుల తరువాత భారత మాజీ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా తొలిసారిగా స్పందించారు. అద్దంలో తనను తాను చూసుకుంటున్న చిత్రాన్ని షేర్ చేసిన ఆమె ‘రిఫ్లెక్ట్’ అంటూ ఒకే ఒక పదాన్ని ట్యాగ్ చేశారు. తనను తాను సమీక్షించుకుంటున్నట్టు అర్ధం వచ్చేలా ఈ కామెంట్ పెట్టారు. అయితే, విడాకుల గురించి ఎటువంటి ప్రస్తావన తీసుకురాలేదు. గత కొంతకాలంగా సానియా-షోయబ్ బంధంపై సోషల్ మీడియాలో పలువార్తలు చక్కర్లు కొట్టాయి.
పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌తో విడాకుల తరువాత భారత మాజీ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా తొలిసారిగా స్పందించారు. అద్దంలో తనను తాను చూసుకుంటున్న చిత్రాన్ని షేర్ చేసిన ఆమె ‘రిఫ్లెక్ట్’ అంటూ ఒకే ఒక పదాన్ని ట్యాగ్ చేశారు. తనను తాను సమీక్షించుకుంటున్నట్టు అర్ధం వచ్చేలా ఈ కామెంట్ పెట్టారు. అయితే, విడాకుల గురించి ఎటువంటి ప్రస్తావన తీసుకురాలేదు. గత కొంతకాలంగా సానియా-షోయబ్ బంధంపై సోషల్ మీడియాలో పలువార్తలు చక్కర్లు కొట్టాయి. వాటిని నిజం చేస్తూ షోయబ్ ఇటీవల సంచలన ప్రకటన చేశాడు. తాను సనా జావేద్ అనే టీవీ నటిని పెళ్లి చేసుకుంటున్నట్టు షోయబ్ ప్రకటించడంతో ఈ రూమర్‌కు ముగింపు పడింది. ఈ సందర్భంగా స్పందించిన సానియా కుటుంబసభ్యులు ఆమె వివాహం అంతకుమునుపే ‘ఖులా’ అయిపోయిందని చెప్పారు. ముస్లిం మహిళలు తమంతట తాముగా విడాకులిచ్చే హక్కును ఖులా అంటారు. ఈ సమయంలో సానియా వ్యక్తిగత గోప్యతను గౌరవించాలని ఆమె తండ్రి ఫ్యాన్స్‌ను అభ్యర్థించారు. ఇక సనా, షోయబ్‌లు చాలా కాలంగా రిలేషన్‌షిప్‌లో ఉన్నట్టు పాక్ మీడియా చెబుతోంది. ఓ టీవీ షో సెట్స్‌లో వారి మధ్య బంధం ఏర్పడినట్టు తెలిపింది. సానియా-షోయబ్‌లకు అయిదేళ్ల వయసున్న కుమారుడు ఉన్నాడు. ప్రస్తుతం అతడు తల్లి వద్దే ఉంటున్నట్టు తెలుస్తోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos