AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇక్కడ ఆడాల్సిందే.. లేదంటే ఇంటికే బంగ్లాదేశ్‌కు ఐసీసీ షాక్

ఇక్కడ ఆడాల్సిందే.. లేదంటే ఇంటికే బంగ్లాదేశ్‌కు ఐసీసీ షాక్

Phani CH
|

Updated on: Jan 12, 2026 | 4:57 PM

Share

వచ్చే టీ20 ప్రపంచకప్ 2026లో తమ మ్యాచ్‌లను భారత్ నుండి శ్రీలంకకు తరలించాలని బంగ్లాదేశ్ డిమాండ్ చేస్తోంది. ముస్తాఫిజుర్ రెహమాన్ ఐపీఎల్ వివాదంతో మొదలైన ఈ సమస్య, భద్రతా కారణాలతో తీవ్రరూపం దాల్చింది. అయితే, ఐసీసీ బంగ్లాదేశ్ అభ్యర్థనను తిరస్కరించి, షెడ్యూల్ ప్రకారం కోల్‌కతా, ముంబైలలోనే ఆడాలని స్పష్టం చేసింది. లేదంటే మ్యాచ్ పాయింట్లు కోల్పోవాల్సి వస్తుందని హెచ్చరించింది.

వచ్చే నెలలో ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్ 2026కు భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి. అయితే బంగ్లాదేశ్ మాత్రం తమ మ్యాచ్‌లను భారత్ నుంచి శ్రీలంకకు తరలించాలని పట్టుబడుతోంది. ఈ వివాదం వెనుక అసలు కథ ఐపీఎల్ వేలంతో మొదలైంది. కోల్‌కతా నైట్ రైడర్స్ రూ.9.20 కోట్లకు కొనుగోలు చేసిన బంగ్లా ఫాస్ట్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహమాన్‌ను వదిలేయాలని బీసీసీఐ ఆదేశించింది. పొరుగు దేశంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు, మైనారిటీలపై దాడుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ తెలిపింది. ముస్తాఫిజుర్‌ను పంపేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన బంగ్లాదేశ్, తమ ఆటగాళ్లకు భారత్‌లో రక్షణ ఉండదని ఆరోపిస్తూ ఐసీసీకి రెండు లేఖలు రాసింది. తమ మ్యాచ్‌లను శ్రీలంకలోని కొలంబోకు మార్చాలని కోరింది. అయితే బెంగళూరులో జరిగిన ఒక సమావేశం తర్వాత బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా బంగ్లాదేశ్ అభ్యర్థనలో పస లేదని తేల్చి చెప్పారు. ఐసీసీ కూడా బంగ్లాదేశ్‌కు స్పష్టమైన హెచ్చరిక జారీ చేసింది. భారత్‌లో భద్రతా పరమైన ముప్పు ఏమీ లేదని, షెడ్యూల్ ప్రకారం కోల్‌కతా,ముంబైలలో ఆడాల్సిందేనని స్పష్టం చేసింది. బంగ్లాదేశ్ జట్టు కోల్‌కతాలో మూడు, ముంబైలో ఒక మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఒకవేళ భద్రత కారణాలు చెబుతూ భారత్‌కు రాకపోతే, ఆ మ్యాచ్ పాయింట్లను ప్రత్యర్థి జట్లకు కేటాయిస్తామని ఐసీసీ హెచ్చరించినట్లు సమాచారం. పాకిస్థాన్ కోసం అమలు చేసిన హైబ్రిడ్ మోడల్ తమకు కూడా వర్తింపజేయాలని బంగ్లాదేశ్ కోరినప్పటికీ, ఐసీసీ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. బీసీసీఐ ఇప్పటికే క్రీడాకారులకు అత్యున్నత స్థాయి భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చింది. ఫిబ్రవరి 7 నుంచి టోర్నీ మొదలుకానుండటంతో, బంగ్లాదేశ్ తన తుది నిర్ణయాన్ని ఈ వారంలోనే ప్రకటించే అవకాశం ఉంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

MSVG Review: చిరును వాడడం అంటే ఇది! అనిల్ మళ్లీ నెగ్గాడ్రోయ్‌..! రివ్యూ…!

Toxic: కారులో ఆ పాడు సీన్‌ పై రచ్చ.. డిలీట్ చేయాలంటూ డిమాండ్

Shreyas Iyer: కుక్క దాడి.. షాక్‌లో శ్రేయస్ అయ్యర్

రష్యా వీధుల్లో భారత టెకీ.. జీతం నెలకు రూ. 1.1 లక్షలు

Shreyas Iyer: కుక్క దాడి.. షాక్‌లో శ్రేయస్ అయ్యర్