PV.Sindhu Dance: చీరకట్టుతో డాన్స్ అదరగొట్టిన పీవీ సింధు.. సింధు స్టెప్పులకు ఫాన్స్ ఫిదా..(వీడియో)
భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు ఒక క్రీడాకారిణిగానే కాదు.. సమయానుసారంగా అచ్చమైన తెలుగమ్మాయిలా ఎంతో ట్రెడిషనల్‌గా వ్యవహరిస్తారు. ఎప్పుడూ చలాకీగా కనిపించే సింధు..ఈ కాలం అమ్మాయిలా ట్రెండ్ ను ఫాలో అవుతారు.
భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు ఒక క్రీడాకారిణిగానే కాదు.. సమయానుసారంగా అచ్చమైన తెలుగమ్మాయిలా ఎంతో ట్రెడిషనల్‌గా వ్యవహరిస్తారు. ఎప్పుడూ చలాకీగా కనిపించే సింధు..ఈ కాలం అమ్మాయిలా ట్రెండ్ ను ఫాలో అవుతారు. సోషల్ మీడియాలో సైతం యాక్టివ్ గా ఉండే ఈ తెలుగమ్మాయి తాజాగా ఓ వీడియోను తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేసారు. ఇందులో పాపులర్ సాంగ్ ‘జిగిల్ జిగిల్’లో పాటకు డ్యాన్స్ చేసారు. చీర కట్టుకున్న సింధు పాటకు తగ్గట్టు అద్భుతమైన స్టెప్పులతో అభిమానులను ఆశ్చర్యపరిచారు. ఇప్పుడీ వీడియో నెట్ లో వైరల్ అయింది. సింధు స్టెప్పులకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. గతంలో కూడా సింధు తన డాన్స్ వీడియోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. అయితే ఈసారి మాత్రం చీరకట్టులో ఎంతో ట్రెండీగా స్టెప్పులేస్తూ అందరి మనసులను ఆకట్టుకున్నారు. గత వారం జాతీయ క్రీడల ప్రారంభ వేడుకల కోసం గుజరాత్ వెళ్లిన సింధు.. గుజరాతీ బట్టలు ధరించి సంప్రదాయ గర్బా డ్యాన్స్ చేసి అలరించారు. ఆగస్టులో కామన్వెల్త్ గేమ్స్ లో స్వర్ణం కైవసం చేసుకున్న సింధు చిన్న గాయం కారణంగా కొన్నాళ్లుగా ఆటకు దూరంగా ఉన్నారు. కాగా డిసెంబర్ లో జరిగే ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య వరల్డ్ సూపర్ సిరీస్ లో పాల్గొనేందుకు సింధు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Jio Laptop Cost: రూ.15 వేలకే జియో ల్యాప్ టాప్.. ఇన్ బిల్ట్ గా 4జీ సిమ్ కూడా.. జియో ఆఫర్..
Boys rent for girls: అమ్మాయిల కోసం అద్దెకు అబ్బాయిలు.! గంటకు ఇంత లెక్కన కిరాయికి బాయ్ ఫ్రెండ్..