oranges: వీరికి నారింజ పండ్లు విషంతో సమానం.. నారింజపండ్లు ఇష్టంగా తింటున్నారా?

నారింజ పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో విటమిన్-సి పుష్కలంగా ఉంటుంది. చలికాలంలో ఈ పండ్లను తినడం మంచిదని వైద్యులు సూచిస్తుంటారు. కానీ కొన్ని రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు నారింజ పండు తినడం అస్సలు మంచిది కాదట. కిడ్నీలో రాళ్ల సమస్య ఉన్నవారు నారింజ పండ్లకు దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు.

oranges: వీరికి నారింజ పండ్లు విషంతో సమానం.. నారింజపండ్లు ఇష్టంగా తింటున్నారా?

|

Updated on: Jun 19, 2024 | 12:12 PM

నారింజ పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో విటమిన్-సి పుష్కలంగా ఉంటుంది. చలికాలంలో ఈ పండ్లను తినడం మంచిదని వైద్యులు సూచిస్తుంటారు. కానీ కొన్ని రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు నారింజ పండు తినడం అస్సలు మంచిది కాదట. కిడ్నీలో రాళ్ల సమస్య ఉన్నవారు నారింజ పండ్లకు దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. కిడ్నీలో రాళ్లు ఉన్నవారు ఆరెంజ్ తింటే.. వారి సమస్య ఇంకాస్త రెట్టింపు అవుతుంది. అలాగే నారింజ పండ్లు కొందరికి గుండెల్లో మంటను కలిగిస్తాయి. జలుబు, దగ్గుతో బాధపడేవారు నారింజకు దూరంగా ఉండటం మంచిదంటున్నారు నిపుణులు. నారింజలో ఆస్ట్రింజెంట్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి జలుబు, దగ్గుతో బాధపడేవారు వీటిని తీసుకోవడం వల్ల జలుబు, దగ్గు ఎక్కువ అయ్యే అవకాశాలు పెరుగుతాయి.

అలాగే ఎసిడిటీతో బాధపడేవారు ఎట్టి పరిస్థితుల్లోనూ నారింజను తినకూడదు. ఎందుకంటే నారింజలో యాసిడ్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎసిడిటీతో బాధపడేవారు నారింజ పండ్లను తింటే కడుపులో యాసిడ్ పరిమాణం పెరుగుతుంది. ఇది కడుపు నొప్పికి దారి తీస్తుంది. దంత సమస్యలతో బాధపడేవారు కూడా నారింజను తినకూడదని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా దంతాలు బలహీనంగా ఉన్నవారు నారింజకు దూరంగా ఉండాలి. ఇది పంటి ఎనామెల్‌పైన ప్రభావం చూపుతుంది. కాల్షియం, బ్యాక్టీరియా పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. దీంతో దంతాల ఆరోగ్యం దెబ్బతింటుంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us
Latest Articles
చక్ దే ఇండియా..విశ్వ విజేతగా భారత జట్టు
చక్ దే ఇండియా..విశ్వ విజేతగా భారత జట్టు
లాంచింగ్‌కు సిద్ధమైన ఐఫోన్‌ 16.. ఫీచర్లు ఎలా ఉండనున్నాయంటే.
లాంచింగ్‌కు సిద్ధమైన ఐఫోన్‌ 16.. ఫీచర్లు ఎలా ఉండనున్నాయంటే.
కింగ్ కోహ్లీ అర్ధ సెంచరీ.. దక్షిణాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
కింగ్ కోహ్లీ అర్ధ సెంచరీ.. దక్షిణాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
ఏపీలోని ఈ ప్రాంతాల్లో వర్షాలు.. ఇదిగో వెదర్ రిపోర్ట్
ఏపీలోని ఈ ప్రాంతాల్లో వర్షాలు.. ఇదిగో వెదర్ రిపోర్ట్
మంటెత్తే మిర్చీతో మెరిసిపోయే అందం.. ట్రై చేస్తే గొప్ప వరమే..
మంటెత్తే మిర్చీతో మెరిసిపోయే అందం.. ట్రై చేస్తే గొప్ప వరమే..
ఏమో శౌర్య.. ఈ విషయంలో మాత్రం నీ ఆలోచన ఏంటో అర్థం కావట్లా..?
ఏమో శౌర్య.. ఈ విషయంలో మాత్రం నీ ఆలోచన ఏంటో అర్థం కావట్లా..?
వారెవ్వా..!! సైరాట్ మూవీ హీరోయిన్ ఏంటి ఇంతలా మారిపోయింది..
వారెవ్వా..!! సైరాట్ మూవీ హీరోయిన్ ఏంటి ఇంతలా మారిపోయింది..
టీ, కాఫీ తాగడం వల్ల కాలేయం దెబ్బతింటుందా? నిపుణులు ఏమంటున్నారంటే.
టీ, కాఫీ తాగడం వల్ల కాలేయం దెబ్బతింటుందా? నిపుణులు ఏమంటున్నారంటే.
భాగ్యనగరంలో ఏంటి ఈ దౌర్భాగ్యం.. వరుస హత్యలతో వణికిపోతున్న ప్రజలు
భాగ్యనగరంలో ఏంటి ఈ దౌర్భాగ్యం.. వరుస హత్యలతో వణికిపోతున్న ప్రజలు
రూ. 40వేల ఫోన్‌ రూ. 27వేలకే.. వన్‌ప్లస్‌ 11ఆర్‌పై అమెజాన్‌లో
రూ. 40వేల ఫోన్‌ రూ. 27వేలకే.. వన్‌ప్లస్‌ 11ఆర్‌పై అమెజాన్‌లో