Khammam: బైక్ స్టార్ట్ చేయబోతే వింత శబ్దం.. ఉలిక్కి పడిన బైక్ యజమాని
ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో ఒక బైక్ యజమానికి విచిత్ర అనుభవం ఎదురైంది. తన బైక్ హెడ్ లైట్ డూమ్‌లోకి ఓ పాము దూరింది. దాన్ని బయటకు రప్పించేందుకు అనేక ప్రయత్నాలు విఫలమయ్యాయి. చివరికి మెకానిక్ సాయం తీసుకుని, హెడ్ లైట్ డూమ్ విప్పదీయడంతో.. పామును బయటకు వచ్చింది.
ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో జరిగిన ఒక విచిత్రమైన సంఘటన వెలుగుచూసింది. ఒక వ్యక్తి బైక్ స్టార్ట్ చేస్తుండగా.. హెడ్ లైట్ డూమ్‌లో పాము మెలికలు తిరుగుతూ కనిపించింది. దీనిని గమనించిన బైక్ యజమాని సురేందర్ పామును బయటకు పంపేందుకు ప్రయత్నించినా.. వల్ల కాలేదు. దీంతో బైక్‌ను సర్వీసింగ్ పాయింట్‌కు తీసుకెళ్లాడు. అక్కడ వాటర్ సర్వీసింగ్ చేసినా అది బయటకు రాలేదు. దీంతో మెకానిక్ వద్ద బైక్ తీసుకెళ్లి హెడ్ లైట్ డూమ్ విప్పడంతో పాము బయటపడింది. దీంతో స్థానికులు పామును చంపేశారు. అది కట్లపాము అని కొందరు.. కానీ వాన కోయిల పాము అని కొందరు అనడం వీడియోలో వినిపించింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Published on: Aug 23, 2025 02:51 PM
వైరల్ వీడియోలు
జియో కీలక ప్రకటన.. ఇకపై సొంత భాషలో ఏఐ సేవలు
యజమాని కోసం ప్రాణాలొడ్డిన శునకం!
ఒక్కపాము కాటేస్తే.. మూడు పాములతో ఆస్పత్రికి..
నీకేమో ఇద్దరు పెళ్లాలు.. నాకు మాత్రం పెళ్లి చేయవా
కాలానికే కన్ను కుట్టిందేమో..అందుకే ఇలా..
మహిళా దొంగల గ్యాంగ్.. నగలు కొట్టేసి ఎక్కడ దాచారో తెలుసా
వేముల వాడ ఆలయంలో నాగు పాము ప్రత్యేక్షం.. భయం భయంగా భక్తులు

