బీట్‌రూట్ తింటే ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలున్నాయి. దీనిని రోజూ తీసుకుంటే రక్తహీనత సమస్య తగ్గుతుంది. అలాగే గుండె సంబంధిత సమస్యలు తగ్గుతాయి. అంతేకాకుండా ఒత్తిడిని తగ్గించడంలోనూ బీట్‌రూట్ మెరుగ్గా పనిచేస్తుంది. ఇందులో పొటాషియం, ఐరన్, మెగ్నీషియం, విటమిన్ బి6 వంటి అనేక పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. రక్తహీనత సమస్యతో బాధపడుతున్నవారు ప్రతి రోజూ బీట్‌రూట్ తింటే ఎంతో మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే బీట్ రూట్ ఎవరు తినకూడదో.. తింటే ఏంజరుగుతుందో తెలుసుకుందాం.. కంటి చూపు సమస్యలను తగ్గించడంలోనూ బీట్‌రూట్ సహాయపడుతుంది. బీట్‌రూట్‌కు ఎరుపు రంగుని కలిగించే బీటాసైయానిన్‌కు పేద్దపేగుల్లో క్యాన్సర్‌తో పోరాడే లక్షణం ఉంది. అనీమియాతో బాధపడేవారు రోజూ ఒక కప్పు బీట్‌రూట్ రసం తాగితే త్వరగా సమస్య నుంచి బయటపడతారు.