Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కాఫీ చేదుగా ఉండడం వెనుక అసలు కారణం ఇదే!

కాఫీ చేదుగా ఉండడం వెనుక అసలు కారణం ఇదే!

Phani CH

|

Updated on: Feb 06, 2025 | 1:23 PM

కాఫీ చేదుగా లేకపోయినా.. కొందరికి మాత్రం ఆ భావన కలుగుతుంటుంది. దీనికి కారణాలను జర్మనీ శాస్త్రవేత్తలు కనిపెట్టారు. కాఫీ సేవించే వ్యక్తి జన్యు లక్షణాలు ఇందుకు దోహదపడుతున్నట్లు తేల్చారు. పరిశోధనలో భాగంగా కాఫీయా అరబికా మొక్క నుంచి సేకరించిన గింజలను శాస్త్రవేత్తలు రోస్ట్‌ చేశారు. వాటిని పొడిగా మార్చి, కాఫీని తయారుచేశారు. కాఫీలోని కెఫీన్‌ చాలా చేదుగా ఉంటుంది.

దీన్ని తొలగించిన కాఫీ కూడా చేదుగానే ఉంటోంది. దీన్నిబట్టి రోస్టెడ్‌ కాఫీలో చేదుకు ఇతర పదార్థాలూ కారణమవుతున్నట్లు స్పష్టమవుతోందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇందులో మొజాంబియోసైడ్‌ కూడా ఉంది. కెఫీన్‌తో పోలిస్తే ఇది 10 రెట్లు ఎక్కువ చేదుగా అనిపిస్తుంది. ఇది.. మానవ శరీరంలో చేదుకు సంబంధించిన టీఏఎస్‌2ఆర్‌43, టీఏఎస్‌2ఆర్‌46 అనే రెండు రకాల గ్రాహకాలను క్రియాశీలం చేస్తుంది. అయితే కాఫీ గింజలను రోస్ట్‌ చేసేటప్పుడు మొజాంబియోసైడ్‌ తీవ్రత గణనీయంగా తగ్గుతున్నట్లు గుర్తించారు. అందువల్ల కాఫీ చేదుగా ఉండటానికి ఇది ఓ కారణంగా గమనించారు. ఈ నేపథ్యంలో రోస్టింగ్‌ వల్ల మొజాంబియోసైడ్‌కు సంబంధించిన ఇతరత్రా పదార్థాలు ఉత్పత్తవుతున్నాయా అన్నది తేల్చాలని శాస్త్రవేత్తలు నిర్ణయించారు. రోస్టింగ్‌ ప్రక్రియలో మొజాంబియోసైడ్‌ క్షీణించి.. ఏడు విభిన్న ఉత్పత్తులుగా రూపాంతరం చెందుతున్నట్లు గుర్తించారు. రోస్టింగ్‌ ఉష్ణోగ్రత, ఎంతసేపు రోస్ట్‌ చేశారన్నదాన్ని బట్టి.. వీటి పరిమాణం ఉంటోంది. మొజాంబియోసైడ్‌ క్రియాశీలం చేసే రుచి రిసెప్టార్లను ఇవి కూడా ఉత్తేజితం చేస్తున్నట్లు తేల్చారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సామాన్యుల కోసం లగ్జరీ రైళ్లు..మారిన కాజీపేట స్టేషన్ రూపురేఖలు

నాలుక కోసి.. శివలింగానికి సమర్పించుకుంది.. చివరకు..

అద్భుత ఫీచర్లతో రైల్వే సూపర్‌ యాప్‌.. అన్ని సేవలూ అందులోనే