సామాన్యుల కోసం లగ్జరీ రైళ్లు..మారిన కాజీపేట స్టేషన్ రూపురేఖలు
దేశంలో వందే భారత్ రైలు అందుబాటులోకి వచ్చిన తర్వాత వాటికి డిమాండ్ పెరిగింది. ఈ రైలు లగ్జరీ, సెమీ హైస్పీడ్ వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. కానీ ఈ రైలు టికెట్ ధర కాస్త ఎక్కువ. దీంతో సామాన్యులు ప్రయాణించలేకపోతున్నారు. అయితే త్వరలో దేశంలోని సామాన్య ప్రజలు కూడా లగ్జరీ రైళ్లలో ప్రయాణించనున్నారు.
రైల్వే మంత్రిత్వ శాఖ ప్రత్యేక రైళ్లతో పాటు సాధారణ రైళ్లలో ప్రయాణించే ప్రయాణికుల కోసం ఆధునిక సౌకర్యాలతో కూడిన రైళ్లను నడపనుంది. దీంతో అన్ని తరగతుల ప్రజలు సుఖంగా, సురక్షితంగా ప్రయాణించవచ్చు. వంద అమృత్ భారత్ రైళ్లకు బడ్జెట్‌లో ఆమోదం తెలిపినట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. అమృత్ భారత్ పనులు కాజీపేట రైల్వే స్టేషన్‌లో చకచకా కొనసాగుతున్నాయి. మొదట్లో స్టేషన్ బయట చేపట్టిన పనులు కొంతవరకు చేసి ఆపేశారు. ముందుగా ప్లాట్‌ఫాంలపై పనులు పూర్తి చేయాలన్న లక్ష్యంతో లోపల పనులు ముమ్మరం చేశారు. ప్రస్తుతం ఉన్న భవనాలు, ప్రాంగణం, ప్లాట్‌ఫారాలను పూర్తి స్థాయిలో మార్పులు చేసి ప్రయాణికులకు ఆధునిక సౌకర్యాలు కల్పించనున్నారు. ఇప్పటికే ఏసీ విశ్రాంత గది పనులు పూర్తికావొచ్చాయి. ఆర్క్ ఆకృతిలో పాదచారుల వంతెన పనులు చివరి దశకు వచ్చాయి. లిఫ్టులు, ఎస్కలేటర్ పనులు కొనసాగుతున్నాయి. ఇవి పూర్తయ్యాక.. స్టేషన్ బయటి పనులు చేపడతారు. కాజీపేట రైల్వే స్టేషన్‌లో జరుగుతున్న అమృత్ భారత్ అభివృద్ధి పనులు, స్టేషన్ నమూనా చిత్రాలను కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:

ఆచి.. తూచి.. అడుగు వెయ్యాలంటారు ఇందుకే..

కొంప ముంచిన కాఫీ.. ఏకంగా రూ.415 కోట్లు పరిహారం..

వేసవిలో బైక్ లు వాడుతున్నారా.. వీటితో జాగ్రత్త!

తాచుపాము కరిచినా..10వ తరగతి పరీక్ష రాసిన విద్యార్థి వీడియో

తెలుగు రాష్ట్రాల్లో బుసలు కొడుతున్న పాములు వీడియో

ఈ కోతికి ఫోన్ కనిపిస్తే చాలు.. వీడియో

ఎక్కడపడితే అక్కడ రీల్స్ చేస్తే ఇలాగే పగుల్తది..
