YS Jagan: పిడుగురాళ్లలో ‘సిద్దం’ బహిరంగ సభ.. సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు..
సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్రకు జనం నీరాజనం పలుకుతున్నారు. 12వ రోజు గంటావారిపాలెం నుంచి మొదలైన బస్సుయాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. దారిపొడవునా వైసీపీ శ్రేణులు, ప్రజలు జగన్‌కు స్వాగతం పలుకుతున్నారు. గంటావారిపాలెం దగ్గర సీఎం జగన్‌ను పల్నాడు జిల్లాకు చెందిన వైసీపీ నేతలు కలిశారు.
సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్రకు జనం నీరాజనం పలుకుతున్నారు. 12వ రోజు గంటావారిపాలెం నుంచి మొదలైన బస్సుయాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. దారిపొడవునా వైసీపీ శ్రేణులు, ప్రజలు జగన్‌కు స్వాగతం పలుకుతున్నారు. గంటావారిపాలెం దగ్గర సీఎం జగన్‌ను పల్నాడు జిల్లాకు చెందిన వైసీపీ నేతలు కలిశారు. పలువురు జనసేన, టీడీపీ నేతలు జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. మాజీ ఎమ్మెల్యేలు పాముల రాజేశ్వరీదేవి, రమేష్ కుమార్ రెడ్డితో పాటు జనసేనకు రాజీనామాకు చేసిన పోతిన మహేష్ వైసీపీలో చేరారు. అనంతరం సీఎం జగన్ బస్సు యాత్ర సొంతమాగులూరు క్రాస్ రోడ్డుకు చేరుకుంది. యాత్రకు జనం నీరాజనం పలికారు. అక్కడి నుంచి అన్నవరప్పాడు చేరుకున్న ముఖ్యమంత్రి బస్సుయాత్రకు భారీ గజమాలతో స్వాగతం పలికారు స్థానికులు. బస్సుపైకి ఎక్కి వారికి అభివాదం చేశారు సీఎం జగన్. రొంపిచర్ల అడ్డరోడ్డు చేరుకున్న సీఎం జగన్ బస్సు యాత్రకు పెద్ద ఎత్తును స్వాగతం పలుకుతున్ ప్రజానీకం. అక్కడి నుంచి బస్సు యాత్ర మర్రిచెట్టుపాలెంకు చేరుకుంది. ఆ తర్వాత అయ్యప్పనగర్‌లో జరుగుతున్న బహిరంగ సభలో సీఎం జగన్ పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో హాజరైన వైసీపీ శ్రేణులు, ప్రజలు హాజరయ్యారు.
క్రిమినల్ లాయర్కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా
ప్రపంచంలో అత్యంత శీతల ప్రాంతం ఈ గ్రామం..
జీపీఎస్ ట్రాకర్తో కనిపించిన రాబందు.. ఎక్కడినుంచి వచ్చిందంటే
పావురానికి ప్రాణం పోసిన కానిస్టేబుల్!
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
మీ ఇంటికే మేడారం ప్రసాదం.. ఆర్టీసీ కొత్త ఆఫర్
పల్లె పడతులు వర్సెస్ పట్నం భామలు..సై అంటే సై..!

