Weekend Hour With Murali Krishna: వారాహి విజయయాత్రపేరుతో విశాఖలో పర్యటిస్తున్న పవన్ కల్యాణ్ అధికారపార్టీని టార్గెట్ చేశారు. విశాఖపట్నం నుంచి వైసీపీని తన్నితరిమేస్తామంటున్న పవన్.. భూ కబ్జాలపైనా తీవ్ర ఆరోపణలు చేశారు. రుషికొండపై జనసేన, వైసీపీకి మధ్య మాటలయుద్ధం కొనసాగుతోంది. అటు వాలంటీర్లపై విమర్శలకు కట్టుబడి ఉన్నామంటున్న జనసేన అధ్యక్షుడు.. ఎంపీ కుటుంబానికే రక్షణ లేని నగరంగా విశాఖను మార్చారంటూ ఆరోపించారు.
వారాహి విజయయాత్రపేరుతో విశాఖలో పర్యటిస్తున్న పవన్ కల్యాణ్ అధికారపార్టీని టార్గెట్ చేశారు. విశాఖపట్నం నుంచి వైసీపీని తన్నితరిమేస్తామంటున్న పవన్.. భూ కబ్జాలపైనా తీవ్ర ఆరోపణలు చేశారు. రుషికొండపై జనసేన, వైసీపీకి మధ్య మాటలయుద్ధం కొనసాగుతోంది. అటు వాలంటీర్లపై విమర్శలకు కట్టుబడి ఉన్నామంటున్న జనసేన అధ్యక్షుడు… ఎంపీ కుటుంబానికే రక్షణ లేని నగరంగా విశాఖను మార్చారంటూ ఆరోపించారు.
విశాఖపట్నంలో కొనసాగుతున్న పవన్ కల్యాణ్ టూరు ప్రకంపనలు.. రుషికొండపై కొనసాగుతున్న మాటలయుద్ధం.. టూరిజం ఆధ్వర్యంలో విశాఖపట్నంలో రుషికొండలో జరుగుతున్న నిర్మాణాలను నిన్న పరిశీలించిన పవన్ కల్యాణ్ అధికార పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. ఒకప్పుడు హైదరాబాద్‌లో దోచుకున్నట్టే ఇప్పుడు విశాఖపట్నంలోనూ రాజధాని పేరుతో దోపిడీలకు పాల్పడుతున్నారని సంచలన ఆరోపణలు చేశారు పవన్. ఎంపీ కుటుంబసభ్యులను కిడ్నాప్ చేస్తే కూడా ఈ ఎంపీ సమర్ధించుకోవడం సిగ్గుచేటన్నారు పవన్ కల్యాణ్.
పవన్ కల్యాణ్ ఆరోపణలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు టూరిజం మంత్రి ఆర్కే రోజా. అనుమతి ఇచ్చిన విస్తీర్ణం కంటే తక్కువ ఏరియాలోనే నిర్మాణాలు జరుగుతున్నాయని.. రుషికొండపై రాద్దాంతం తగదన్నారు. తీసుకున్న ప్యాకేజ్ కోసం జనసేన అధ్యక్షుడు పవన్ పనిచేస్తున్నారని మండిపడ్డారు. గతంలో విశాఖలో టీడీపీ నేతలు భూములు దోచుకుంటే.. ఇప్పుడు ఇన్‌ఫోసిస్, అదానీ డేటా సెంటర్, రహేజా వంటి కంపెనీలను సీఎం జగన్ తీసుకొచ్చారన్నారు మంత్రి.
విశాఖను రాజధాని పేరుతో దోచుకుంటున్నారని జనసేన అంటే.. పాలనా రాజధానినగరంగా ప్రకటిస్తే జనసేన, టీడీపీ విషం కక్కుతున్నాయంటోంది వైసీపీ. సాగర తీరంలో రేగిన విమర్శల తుఫాను ఏ తీరం దాటుతుందో చూడాలి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..