Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జయలలిత సంపాదించిన బంగారం, భూములు ఇకపై వారివే

జయలలిత సంపాదించిన బంగారం, భూములు ఇకపై వారివే

Phani CH

|

Updated on: Jan 31, 2025 | 9:24 PM

అవినీతి కేసులో స్వాధీనం చేసుకున్న జయలలిత బంగారం ఇన్నాళ్లు కర్ణాటక సీబీఐ కోర్టు వద్దే ఉంది. తాజాగా ఆ బంగారాన్ని తమిళనాడు ప్రభుత్వానికి అప్పగించాలని నిర్ణయించింది. ఇంతకీ ఆ బంగారం ఎంత.. దాన్ని ఏం చేస్తారు.. దానిపై ఎవరెవరు ఆశలు పెట్టుకున్నారో తెలుసుకుందాం..! ఎడిఎంకె పార్టీని ఒంటి చేత్తో నడిపించిన జయలలిత 1991లో తొలిసారి తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

తరువాత 1996లో డీఎంకే హయాంలో ఆమెపై ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న కేసు నమోదైంది. జయలలిత దత్తపుత్రుడిగా చెప్పే సుధాకరన్ వివాహం 1995లో వైభవంగా జరిగింది. ఆ తర్వాత డీఎంకే అధికారంలోకి రాగానే అవినీతి కేసు నమోదైంది. జయలలిత తోపాటు ఆమె సన్నిహితురాలు శశికళ, సుధాకరన్, ఇళవరసి నలుగురిపైనా కేసు ఫైలైంది. ఈ కేసు విచారణ తమిళనాడులో జరిగితే జయలలిత దీనిని ప్రభావితం చేస్తారని పిటిషన్ దాఖలైంది. దీంతో ఈ కేసును కర్ణాటక కోర్టుకు బదిలీ చేశారు. అక్కడే విచారణ జరిగింది. ఈ కేసును బెంగళూరులోని ప్రత్యేక కోర్టు దర్యాప్తు చేస్తుండగా, 2014లో దోషులందరికీ నాలుగు సంవత్సరాల జైలు శిక్ష పడింది. దీంతో వారు కర్ణాటక హైకోర్టుకు అప్పీలుకు వెళ్లారు. ఆ కోర్టు శిక్షను రద్దు చేసింది. కానీ ఈ ఉత్తర్వును కర్ణాటక ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్ చేసింది. జయలలిత సహా నలుగురికీ బెంగళూరు ప్రత్యేక కోర్టు విధించిన శిక్షను సుప్రీంకోర్టు సమర్థించింది. కానీ సుప్రీంకోర్టు తీర్పు రాకముందే, జయలలిత అనారోగ్యంతో డిసెంబర్ 5, 2016న మరణించారు. దీని తరువాత, శశికళ, ఇళవరసి, సుధాకరన్.. ఈ ముగ్గురూ బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో నాలుగు సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించారు. తర్వాత విడుదల అయ్యారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

హైదరాబాద్‌లో తొలి గులియన్ బారే సిండ్రోమ్ కేసు నమోదు

బడ్జెట్ తరువాత బంగారం ధర పెరుగుతుందా ?? తగ్గుతుందా ??

ఇంట్లోకి చొరబడి.. స్విమ్మింగ్ పూల్లో స్నానం చేసి! హీరోకు షాకిచ్చిన ఆగంతకుడు

విషాదంలో రాణా !! కన్నీళ్లతో పాడె మోసిన హీరో

పద్మ అవార్డ్‌ ఏమో కానీ.. ఈ స్టార్స్ మధ్య గొడవ షురూ