PM Modi Statue: 200 కోట్లతో 190 అడుగుల మోదీ కాంస్య విగ్రహం.. ఎక్కడంటే.?
ప్రస్తుతం దేశంలో విగ్రహాల హవా నడుస్తోంది. రోజుకోచోట అత్యంత ఎత్తయిన విగ్రహాలను ఆవిష్కరిస్తున్నారు. తాజాగా అస్సాంలోని గువాహటికి చెందిన వ్యాపారవేత్త నబీన్ చంద్రబోరా ప్రధాని నరేంద్రమోదీపై అభిమానంతో అత్యంత ఎత్తయిన మోదీ కాంస్య విగ్రహాన్ని నిర్మించతలపెట్టారు. 190 అడుగుల ఎత్తైన ప్రధాని క్యాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ ప్రాజెక్ట్‌కు సోమవారమే ఆ వ్యాపారవేత్త భూమి పూజ చేశారు.
ప్రస్తుతం దేశంలో విగ్రహాల హవా నడుస్తోంది. రోజుకోచోట అత్యంత ఎత్తయిన విగ్రహాలను ఆవిష్కరిస్తున్నారు. తాజాగా అస్సాంలోని గువాహటికి చెందిన వ్యాపారవేత్త నబీన్ చంద్రబోరా ప్రధాని నరేంద్రమోదీపై అభిమానంతో అత్యంత ఎత్తయిన మోదీ కాంస్య విగ్రహాన్ని నిర్మించతలపెట్టారు. 190 అడుగుల ఎత్తైన ప్రధాని క్యాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ ప్రాజెక్ట్‌కు సోమవారమే ఆ వ్యాపారవేత్త భూమి పూజ చేశారు. మోదీ విగ్రహం కోసం ఆయన ఏకంగా 200 కోట్లు ఖర్చుచేయనున్నారు. తన స్థలంలోనే ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్న ఆ వ్యాపారి… శంకుస్థాపన కార్యక్రమాన్ని ఏకంగా మూడు రోజులపాటు ఘనంగా నిర్వహించారు. పీఠభాగంతో కలుపుకొని విగ్రహం ఎత్తు 250 అడుగులు ఉంటుందని నవీన్‌చంద్ర తెలిపారు. విగ్రహం మెడ భాగంలో అసోం సంస్కృతికి చిహ్నంగా గమోసా అంటే అసోం ప్రజలు ధరించే ఖద్దరు వస్తం ఉంటుందని ఆయన వివరించారు. విగ్రహ ప్రతిష్ఠాపన వివరాలతో గతేడాది ప్రధాని కార్యాలయానికి లేఖ కూడా పంపినట్లు తెలిపారు. గువాహాటి చెందిన నవీన్ చంద్ర బోరాకు ప్రధాని మోదీ అంటే వల్లమాలిన అభిమానం.
ఓ విషయంలో 2016లో మోదీ చేతుల మీదుగా ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. దీంతో అప్పుడే ప్రధాని కోసం ఓ భారీ విగ్రహాన్ని నెలకొల్పాలనే ఆలోచన వచ్చిందని చెప్పారు. తన సొంత డబ్బులతో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నానని, దీనిని తన సొంత స్థలంలోనే నెలకొల్పుతున్నానని వివరించారు. అలాగే, విగ్రహానికి సంబంధించి ఇప్పటికే తుది డిజైన్ ప్లాన్ కూడా సిద్ధమైందని చెప్పారు. విగ్రహ ఏర్పాటు కోసం ఖర్చుచేస్తున్న మొత్తం ఎలా సమకూరుతుందనే వివరాలతో పీఎంఓకి లేఖ రాసినట్టు ఆయన పేర్కొన్నారు. అంతేకాదు, ఈ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరవుతారని ఆశిస్తున్నానని అన్నారు. ఆయనపై తనకున్న ప్రేమతోనే ఇది చేస్తున్నానని, ప్రపంచంలోని అత్యుత్తమ ప్రధానులలో నరేంద్ర మోదీ ఒకరని కొనియాడారు. అలాంటి వ్యక్తి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్న తాను ఎంతో అదృష్టవంతుడ్ని అని వ్యాఖ్యానించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos