Adluri Laxman Kumar’s vehicle met with accident: తెలంగాణ ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌కు ఘోర ప్రమాదం తప్పింది. జగిత్యాల జిల్లా ఎండవల్లి మండలం అంబారిపేట దగ్గర ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ వాహనం బోల్తాపడింది. ప్రమాద సమయంలో అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ కారులోనే ఉన్నారు. కారులో ఉన్న వారందరికి స్వల్ప గాయాలు అయ్యాయి. ఎమ్మెల్యే లక్ష్మణ్ సహా.. గాయాలైన వారందరినీ కరీంనగర్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఎదురుగా వస్తున్న లారీని తప్పించే క్రమంలో విప్ అడ్లూరి వాహనం బోల్తాపడినట్లు పోలీసులు తెలిపారు.
కాగా.. ఎమ్మెల్యే లక్ష్మణ్ వాహనం బోల్తా పడిందన్న సమాచారం అందుకున్న కాంగ్రెస్ నాయకులు ఆందోళనకు గురయ్యారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరాతీశారు. ఎమ్మెల్యేను పరామర్శించేందుకు ధర్మపురి నాయకులు సైతం ఆసుపత్రికి చేరుకుంటున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..