AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Congress Manifesto: అభయహస్తం పేరుతో , భారీ హామీలతో తెలంగాణ కాంగ్రెస్ మేనిఫెస్టో.

Congress Manifesto: అభయహస్తం పేరుతో , భారీ హామీలతో తెలంగాణ కాంగ్రెస్ మేనిఫెస్టో.

Anil kumar poka
|

Updated on: Nov 17, 2023 | 9:00 PM

Share

తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో విజయం సాధించే దిశగా వ్యూహాలకు పదును పెడుతోంది. తెలంగాణ ఎన్నికల పోలింగ్ 13 రోజులు మాత్రమే ఉండడంతో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ శుక్రవారం మేనిఫెస్టోను విడుదల చేసింది.కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గాంధీభవన్లో మేనిఫెస్టోను విడుదల చేశారు. మొత్తం 42 పేజీలతో 62 ప్రధాన హామీలతో ఈ మేనిఫెస్టోను విడుదల చేశారు.

తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో విజయం సాధించే దిశగా వ్యూహాలకు పదును పెడుతోంది. తెలంగాణ ఎన్నికల పోలింగ్ 13 రోజులు మాత్రమే ఉండడంతో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ శుక్రవారం మేనిఫెస్టోను విడుదల చేసింది.కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గాంధీభవన్లో మేనిఫెస్టోను విడుదల చేశారు. మొత్తం 42 పేజీలతో 62 ప్రధాన హామీలతో ఈ మేనిఫెస్టోను విడుదల చేశారు. మేనిఫెస్టో ద్వారా ప్రజలను ఆకర్షించే అనేక పథకాలను పొందుపరిచిన కాంగ్రెస్ పార్టీ, ప్రధానంగా తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామో చెబుతూ ప్రజాక్షేత్రంలోకి వెళుతోంది. అభయ హస్తం పేరుతో మ్యానిఫెస్టోను రూపకల్పన చేశారు. తెలంగాణకు అవసరమైనన్ని అంశాలు ఇందులో ఉన్నట్లు వెల్లడించారు. కాంగ్రెస్‌ ముఖ్యంగా తన మ్యానిఫెస్టోలో మొదటి ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాల భర్తీ చేసేలా చర్యలు చేపడతామన్నారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే మెగా డీఎస్సీ నిర్వహిస్తామన్నారు. తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు ప్రతి నెలా 25,000 రూపాయల పెన్షన్‌ , అమరవీరుల కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పిస్తామన్నారు. తెలంగాణ ఉద్యమకారులపై ఉన్న కేసులను పూర్తిగా ఎత్తివేస్తామన్నారు. అంతేకాదు, తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల ఇళ్ల స్థలం ఉచితంగా ఇస్తామన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే రైతులకు 24 గంటలూ ఉచిత విద్యుత్‌, 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. 3 లక్షల రూపాయలు వడ్డీ లేని పంటరుణాలు ఇస్తామన్నారు. అలాగే ఆరోగ్యశ్రీ పథకం 10 లక్షల రూపాయలకు పెంచుతామన్నారు. ధరణి స్థానంలో భూమాత పోర్టల్‌ తీసుకువస్తామని, ల్యాండ్‌ కమిషన్‌ ఏర్పాటు చేసి భూసమస్యలు పరిష్కరిస్తామన్నారు. సీఎం క్యాంపు ఆఫీసులో ప్రతి రోజూ ప్రజాదర్భార్‌ నిర్వహఙస్తామన్నారు. సింగరేణిని ప్రవేటీకరించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. విద్యార్ధులకు ఫ్రీ ఇంటర్నెట్‌ సౌకర్యం కల్పిస్తామని, తెలంగాణలో మూతపడిన 6 వేల ప్రభుత్వ పాఠశాలలను తిరిగి పునరుద్ధరిస్తామన్నారు. తెలంగాణకు మరో 4 ట్రిపుల్‌ ఐటీ కళాశాలలు తెస్తామన్నారు. 18 ఏళ్లు నిండిన విద్యార్థినులకు ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ ఉచితంగా ఇస్తామన్నారు. మధ్యాహ్న భోజన కార్మికుల వేతనాన్ని పదివేలకు పెంచుతామని హామీ ఇచ్చారు. గ్రామ, వార్డు మెంబర్లకు 1500 రూపాయలు గౌరవవేతనం, CPS విధానం రద్దు చేసి, OPC విధానం అమలుచేస్తామన్నారు. ప్రతి ఆటో డ్రైవర్‌కు 12 వేల రూపాయలు ఆర్ధికసాయం, కొత్తగా మూడు ఎస్సీ ఎస్సీ కార్పొరేషన్లు, బీసీ కులగణన చేసి రిజర్వేషన్లు కల్పిస్తామన్నారు. ప్రతి జిల్లాలో బీసీ భవన్‌, ఈబీసీలకు ప్రత్యేక సంక్షేమ బోర్డు, మైనారిటీ సబ్‌ ప్లాన్‌ తీసుకొస్తామన్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.