Viral Video: అతనితో చెప్పుదెబ్బలు తింటే ఎన్నికల్లో గెలుపు ఖాయమట.! వీడియో.
రాజకీయనాయకులు, సినిమా వాళ్లకు ఉండే సెంటిమెంట్లు మరెవరికీ ఉండవు. అందుకే ఎన్నికలు వచ్చేసరికి తమ ఇష్టదైవాలను, బాబాలను దర్శించుకుంటూ ఉంటారు. ఏ కారణంగానైనా విజయం పొందితే ఇక అదే సెంటిమెంట్‌గా ఫాలోఅవుతుంటారు. తాజాగా మధ్యప్రదేశ్ ఎన్నికల్లో పోటీలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి ఒకరు ఇలాంటి సెంటిమెంట్‌నే ఫాలో అయ్యారు. స్థానికంగా ఉన్న ఓ బాబాతో చెప్పులతో కొట్టించుకున్నారు. మధ్యప్రదేశ్ అసెంబ్లీకి శుక్రవారం పోలింగ్ జరిగింది.
రాజకీయనాయకులు, సినిమా వాళ్లకు ఉండే సెంటిమెంట్లు మరెవరికీ ఉండవు. అందుకే ఎన్నికలు వచ్చేసరికి తమ ఇష్టదైవాలను, బాబాలను దర్శించుకుంటూ ఉంటారు. ఏ కారణంగానైనా విజయం పొందితే ఇక అదే సెంటిమెంట్‌గా ఫాలోఅవుతుంటారు. తాజాగా మధ్యప్రదేశ్ ఎన్నికల్లో పోటీలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి ఒకరు ఇలాంటి సెంటిమెంట్‌నే ఫాలో అయ్యారు. స్థానికంగా ఉన్న ఓ బాబాతో చెప్పులతో కొట్టించుకున్నారు. మధ్యప్రదేశ్ అసెంబ్లీకి శుక్రవారం పోలింగ్ జరిగింది. ఈ ఎన్నికల్లో రత్లాం నియోజకవర్గం నుంచి బరిలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి పరాస్ సాక్లేచా శుక్రవారం ఉదయం రోడ్డు పక్కన ఉండే ఫకీర్ బాబా వద్దకు వెళ్లి చెప్పులతో కొట్టించుకుని ఆశీర్వాదం పొందారు. బాబాను సందర్శించుకున్న పరాస్ సాక్లేచా కొత్త చెప్పులను సమర్పించారు. వాటిని తీసుకున్న బాబా.. పరాస్ నెత్తిపై టపటపా బాదేసాడు. ఆ తర్వాత చెప్పులతో రెండు చెంపలు చెళ్లుమనిపించాడు. ఆయన కొడుతున్నంతసేపు పరాస్ ఆనందంతో పరవశించిపోయారు. ఆయనతో చెప్పు దెబ్బలు తింటే ఎన్నికల్లో విజయం తథ్యమనే ఉద్దేశంతోనే ఆయనిలా చేశారట. అయితే, చెప్పుదెబ్బలకు ఏమాత్రం ఓట్లు రాలతాయో చూడాలి మరి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.
అది బస్సా లేక విమానమా? కేరళ ఆర్టీసీ లగ్జరీ ప్రయాణం!
దుబాయ్‌లో సింగిల్ రూమ్ అద్దె ఎంతో తెలిస్తే నోరెళ్లబెడతారు!
అయ్యో.. అక్కడ సముద్రం ఎండిపోయిందా!
పిందె నుంచి కాయ వరకూ.. కొబ్బరికాయ తయారీలో ఆసక్తికరమైన దశలు
క్లాస్ రూంలో పాఠాలు చెబుతున్న టీచర్ అంతలోనే
బైకులోనుంచి వింత శబ్దాలు..దెబ్బకు బైకు వదిలి వ్యక్తి పరుగులు
ఏసీ కోచ్‌లో అనుమానాస్పదంగా మహిళ లగేజ్.. ఓపెన్ చేయగా చేయగా

