Explainer: అటు రైసు.. ఇటు రైలు మీకు అర్థమవుతోందా.? మోదీ సర్కారు చర్యలతో లబ్ది
పట్టెడన్నం పొట్టలోకి వెళ్లాలంటే.. రోజంతా రెక్కలు ముక్కలు చేసుకున్నా చాలదు. ఇది దేశంలో ఎన్నో కుటుంబాల దీనస్థితి. స్వాతంత్ర్యం వచ్చి ఇన్నాళ్లయినా చేరుకోవాల్సిన గమ్యాన్ని వేగంగా, సురక్షితంగా చేరే రోజు కోసం నిన్న మొన్నటి వరకు ఎదురు చూడాల్సిన దుస్థితి. కానీ మోదీ సర్కారు తీసుకున్న రెండు చర్యలు.. అటు పేద, మధ్యతరగతి వారికి మూడు పూటలా కడుపు నిండా తినే అవకాశం కల్పించాయి. ఇటు ప్రయాణికులు అత్యంత వేగంగా, హ్యాపీగా, సేఫ్ గా తమ గమ్యాన్ని చేరుకోగలుగుతున్నారు. అలా ఈ రెండు సదుపాయాలను కేంద్రం మన కళ్ల ముందుంచింది. అవే.. 29 రూపాయిలకే భారత్ రైస్... వందే భారత్ రైల్ సర్వీస్.
పట్టెడన్నం పొట్టలోకి వెళ్లాలంటే.. రోజంతా రెక్కలు ముక్కలు చేసుకున్నా చాలదు. ఇది దేశంలో ఎన్నో కుటుంబాల దీనస్థితి. స్వాతంత్ర్యం వచ్చి ఇన్నాళ్లయినా చేరుకోవాల్సిన గమ్యాన్ని వేగంగా, సురక్షితంగా చేరే రోజు కోసం నిన్న మొన్నటి వరకు ఎదురు చూడాల్సిన దుస్థితి. కానీ మోదీ సర్కారు తీసుకున్న రెండు చర్యలు.. అటు పేద, మధ్యతరగతి వారికి మూడు పూటలా కడుపు నిండా తినే అవకాశం కల్పించాయి. ఇటు ప్రయాణికులు అత్యంత వేగంగా, హ్యాపీగా, సేఫ్ గా తమ గమ్యాన్ని చేరుకోగలుగుతున్నారు. అలా ఈ రెండు సదుపాయాలను కేంద్రం మన కళ్ల ముందుంచింది. అవే.. 29 రూపాయిలకే భారత్ రైస్.. వందే భారత్ రైల్ సర్వీస్. ఇప్పుడు వందే భారత్ స్లీపర్ రైల్ కూడా వస్తోంది. అసలు ఈ రెండింటి వల్ల ఎవరికి ఎంత మేర ఉపయోగం ఉంటుంది?
ముందుగా భారత్ రైస్ సంగతి చూస్తే.. 29 రూపాయిలకే దీనిని ప్రభుత్వం అందిస్తోంది. 5 కేజీలు, 10 కేజీల ప్యాకెట్లలో అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతానికైతే ప్రభుత్వ సంస్థలైన NAFED, NCCF, కేంద్రీయ భండార్ ద్వారా వీటి అమ్మకాలు జరుగుతున్నాయి. త్వరలో ఈ-కామర్స్ సైట్ల ద్వారా సేల్ చేయబోతున్నారు. దీనికోసం భారత ఆహార సంస్థ.. 5 లక్షల టన్నుల బియ్యాన్ని సరఫరా చేయనుంది. ఇప్పుడంటే బియ్యం ఇవ్వడం ప్రారంభించింది కానీ.. భారత్ బ్రాండ్ పేరుతో ఇంతకుముందే.. ఉల్లిపాయలు, గోధుమపిండి, టమోటాలు. పప్పులను తక్కువ రేటుకే అమ్మింది. పప్పులను కిలో 60 రూపాయిలకు ఇచ్చింది. గోధుమపిండిని కిలో 27 రూపాయిల 50 పైసలకు అందించింది. దీనిని భారత్ ఆటా పేరుతో గత ఏడాది నవంబర్ 6నే ఆందుబాటులోకి తీసుకొచ్చింది. చౌక ధరలకే వీటిని అమ్మడం ఇప్పుడు ప్రారంభం కాలేదు. ఎన్నో దశాబ్దాలుగా రేషన్ షాపుల ద్వారా వీటి అమ్మకాలు జరుగుతున్నాయి. కానీ ద్రవ్యోల్బణం దేశంలో పెరుగుతున్న వేళ.. ఇలాంటి చర్యలు దానిని కంట్రోల్ చేయడానికి ఉపయోగపడతాయి. కరోనా తరువాత ఎన్నో కుటుంబాల ఆర్థిక పరిస్థితి దారుణంగా తయారైంది. పైగా నిత్యావసర వస్తువుల ధరలు దాదాపు 15 శాతం పెరిగాయి. అందుకే ఇలాంటి సమయంలో ఈ పథకాలు వారికి ఆసరాగా నిలుస్తాయి.
ఇక వందే భారత్ రైలు ఇప్పటికే దేశంలో పరుగులు పెడుతోంది. వేగంగా ప్రయాణించే ఈ రైలులో ఇప్పటివరకు కూర్చునే సదుపాయం మాత్రమే ఉంది. ఇకపై ఇందులో స్లీపర్ క్లాస్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. మరో రెండు నెలల్లోనే.. అంటే ఏప్రిల్ లోనే ఇవి పట్టాలెక్కనున్నాయి. ఢిల్లీ, ముంబై మధ్య ఫస్ట్ రైలు సర్వీస్ ఉంటుంది. వచ్చే నెల నుంచి ట్రయల్ కూడా వేస్తున్నారు. చెప్పాలంటే రాజధాని ఎక్స్ ప్రెస్ ను మించిన స్పీడ్ తో పరుగులు పెట్టే ఈ రైలులో 16 కోచ్ లు ఉంటాయి. కొన్నింటికి 20 కోచ్ లు కూడా లింక్ చేస్తారు. ఫస్ట్ ఫేజ్ లో 10 రూట్లలో ఇవి నడవనున్నాయి. లాంగ్ నైట్ జర్నీ ఉన్న రూట్లకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. మన దేశంలో ఉన్న రైలు సర్వీసులు అన్నింటికన్నా.. వీటి వేగం ఎక్కువ. సో.. దేశంలో మెయిన్ సిటీస్ మధ్య జర్నీ స్పీడ్ పెరగడంతో… ప్రయాణికులకు రెండు గంటల సమయం ఆదా అవుతుంది. పైగా 40 వేల మామూలు కోచ్ లను వందే భారత్ ఎక్స్ ప్రెస్ కోచ్ లుగా మారుస్తామని కేంద్రం.. బడ్జెట్ ప్రసంగంలోనే చెప్పింది. త్వరలో వందే మెట్రో రైలు కూడా పట్టాలెక్కే అవకాశం ఉంది. అంటే రైల్వేకు ఇంకా మంచి రోజులు వచ్చినట్టే.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..