ఫోన్ ట్యాపింగ్ కేసులో రఘునందన్ రావు కీలక వ్యాఖ్యలు..
ఫోన్ ట్యాపింగ్ కేసులో మనీలాండరింగ్ జరిగిందని ఆరోపించారు రఘునందన్ రావు. ఈకేసులో రాజ పుష్ప వెంకట్రామిరెడ్డి పేరు వినిపిస్తోందన్నారు. వెంకట్రామిరెడ్డికి డబ్బులు చేరవేశామని రాధాకిషన్ రావు అన్నారు అని తెలిపారు. రాధాకిషన్ రావు స్టేట్‌మెంట్ ఆధారంగా ఈడీ దర్యాప్తు చేయాలని కోరారు. వెంకట్రామిరెడ్డికి ఇన్ని వేల కోట్లు ఎలా వచ్చాయని రఘునందన్ రావు ప్రశ్నించారు.
తెలంగాణలో సంచలనంగా మారింది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం. ఇందులో ప్రముఖులు ఉన్నట్లు దర్యాప్తులో వెల్లడవుతోంది. తెలంగాణలో లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఇలాంటి సంఘటనలు జరగడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. అధికార కాంగ్రెస్ పార్టీ ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని పోలీసు ఉన్నతాధికారులకు ఆదేశించింది. ఈ తరుణంలోనే దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మనీలాండరింగ్ జరిగిందని ఆరోపించారు రఘునందన్ రావు. ఈకేసులో రాజ పుష్ప వెంకట్రామిరెడ్డి పేరు వినిపిస్తోందన్నారు. వెంకట్రామిరెడ్డికి డబ్బులు చేరవేశామని రాధాకిషన్ రావు అన్నారు అని తెలిపారు. రాధాకిషన్ రావు స్టేట్‌మెంట్ ఆధారంగా ఈడీ దర్యాప్తు చేయాలని కోరారు. వెంకట్రామిరెడ్డికి ఇన్ని వేల కోట్లు ఎలా వచ్చాయని రఘునందన్ రావు ప్రశ్నించారు. వెంకట్రామిరెడ్డి ఆస్తులపై పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని ఆధికారులకు తెలిపారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వెంకట్రామిరెడ్డి ఎంపీగా పోటీ చేయడానికి అనర్హుడని ఈ సందర్భంగా అన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
తండ్రితో గొడవ పడి భారత్లోకి పాక్ మహిళ
మంచు లేక బోసిపోయిన హిమాలయాలు
ఉద్యోగం చేస్తూనే కుబేరులు కావొచ్చా ?? సంపద సృష్టి రహస్యం ఇదే
గూగుల్ మ్యాప్స్ను గుడ్డిగా నమ్మాడు.. కట్ చేస్తే నదిలోకి..
రోజుకి రూ 10 వేల వడ్డీ తీర్చలేక కంబోడియాలో కిడ్నీ అమ్ముకున్న రైతు
అది కుక్క కాదు.. నా కూతురు !
ఇదేం పెళ్లిరా బాబూ.. AIని పెళ్లాడిన జపాన్ యువతి

