Political Movies: వెండితెరపై పొలిటికల్ ఫైట్.! ఏపీలో మళ్లీ మొదలైన పొలిటికల్ సినిమాల సీజన్

ఎన్నికలొస్తున్నాయి. ఏపీలో మళ్లీ పొలిటికల్ మూవీ సీజన్ మొదలయ్యింది. ఇప్పటికే యాత్ర సెకెండ్ పార్ట్ రిలీజ్ అయ్యింది కొన్ని రోజులుగా వాయిదా పడుతూ వస్తున్న వ్యూహం మూవీ గురించి చెప్పాల్సిన పనే లేదు. ఏపీలో రిలీజ్‌కాకుండానే రచ్చ రచ్చ జరిగింది. కోర్టు మెట్లెక్కిన ఈ సినిమాపై.. పలు మార్లు అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. చివరకు రేపో.. మాపో రిలీజ్ అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది.

Political Movies: వెండితెరపై పొలిటికల్ ఫైట్.! ఏపీలో మళ్లీ మొదలైన పొలిటికల్ సినిమాల సీజన్

|

Updated on: Feb 10, 2024 | 5:56 PM

ఎన్నికలొస్తున్నాయి. ఏపీలో మళ్లీ పొలిటికల్ మూవీ సీజన్ మొదలయ్యింది. ఇప్పటికే యాత్ర సెకెండ్ పార్ట్ రిలీజ్ అయ్యింది కొన్ని రోజులుగా వాయిదా పడుతూ వస్తున్న వ్యూహం మూవీ గురించి చెప్పాల్సిన పనే లేదు. ఏపీలో రిలీజ్‌కాకుండానే రచ్చ రచ్చ జరిగింది. కోర్టు మెట్లెక్కిన ఈ సినిమాపై.. పలు మార్లు అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. చివరకు రేపో.. మాపో రిలీజ్ అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. వీటికి కౌంటర్‌గా త్వరలో మరో మూవీ రిలీజ్‌కి సిద్ధంగా ఉంది. అదే రాజధాని ఫైల్స్.. ఆ టీజర్, టైటిల్ రెండూ చూడగానే.. విషయం క్రిస్టల్ క్లియర్ గా అర్థమైపోతోంది. కంప్లీట్‌గా ఏపీ సర్కారుపై ఎటాక్ అని. రాజధాని విషయంలో ఏపీ ప్రభుత్వం అన్యాయం చేసిందని, మోసం చేసిందన్నది ఈ సినిమా కథావస్తువు. అది ఏ స్టైల్లో ప్రజెంట్ చేశారన్న విషయం టీజర్లోనే తెలిసిపోతోంది. ఈ సినిమాలు ఎందుకు తీశారన్నది ఓపెన్ సీక్రెట్… ఈ టైంలో ఎందుకు రిలీజ్ చేస్తున్నారన్నది కూడా ఓపెన్ సీక్రెటే ఎన్ని ప్రచారాలు చేసినా.. సోషల్ మీడియా ఎన్ని మూలల్లో చొచ్చుకెళ్లిపోయినా సరే సినిమా .. సినిమానే అందుకే పార్టీలు కూడా ఇప్పుడు బిగ్ స్క్రీన్‌కే ఓటేస్తున్నాయి. నిజానికి గతంలో ఇలాంటి కాంట్రవర్శియల్ మూవీస్ ఎన్నొచ్చినా.. 2019 ఎన్నికల తర్వాత డిసెంబర్లో వర్మ సృష్టించిన అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు మూవీ తర్వాతే ఈ ట్రెండ్ మరింత పాపులర్ అయ్యింది. వర్మ మూవీ అనగానే… కథ రెడీ కాకముందే.. కాంట్రవర్శీ మొదలవుతుంది. అందులోని ఆయన ఇలాంటి పొలిటకల్ సబ్జెక్ ఎంచుకున్న తర్వాత దాన్ని ఎంతగా జనంలో చర్చకు పెట్టాలో అంతగా పెడతారాయన టార్గెట్ ఎవరన్నది ఆయనకు తెలుసు.. చూసే జనాలకు తెలుసు.. ఆయనకు టార్గెట్ అవుతున్న వారికి కూడా తెలుసు బట్ కథను మాత్రమే చెబుతున్నానని, అంతగా ప్రశ్నిస్తే జనం అనుకుంటున్నది తీస్తున్నానని, ఏ ప్రశ్నకైనా ఇన్ స్టెంట్ సమాధానం ఆయన దగ్గర 24 గంటలు 365 రోజులూ ఉంటుంది. మొత్తానికి ఎలాగైనా ఆయన తనను సమర్థించుకోవడంలో దిట్ట. ఒక డైరక్టర్‌గా ఆయన కావాల్సింది తన సినిమా జనం నోళ్లలో నాననడం, ఒక పార్టీగా.. ప్రత్యర్థి పార్టీని జనంలో చులకన చెయ్యడం రాజకీయ పార్టీలకు కావాల్సింది. 2019 ఎన్నికల తర్వాతైనా.. 2024 ఎన్నికల ముందైనా.. అంతకు మించి అందులో పరమార్థం ప్రత్యేకంగా ఏం లేదు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఈ మూవీస్‌కి కలెక్షన్స్‌తో పని లేదు. కాంట్ర వర్శీ అయితే చాలు.. జనంలోకెళ్తే చాలు.. వాళ్ల మెదళ్లలో తిష్ట వేస్తే చాలు.. అనుకున్న లక్ష్యం సాధించినట్టే.

అందుకే వ్యూహం విషయంలో టీజర్ రిలీజైనప్పటి నుంచే ప్రత్యర్థి పార్టీ టీడీపీలో వ్యతిరేకించడం మొదలుపెట్టింది. అంతకు ముందు వర్మ ఎఫెక్ట్ ఆల్రెడీ టీడీపీపై ఉంది. అమ్మరాజ్యంలో కడప బిడ్డలు పేరుతో 2019 లో ఆయన టీడీపీ అధినేత చంద్రబాబును టార్గెట్ చేస్తూ తీసిన సినిమా కమర్షియల్‌గా సక్సెస్.. ఫెల్యూర్ సంగతి పక్కనపెట్టేస్తే పొలిటికల్‌గా మాత్రం సూపర్ డూపర్ హిట్టయ్యింది. అందుకే ఈ సారి వ్యూహం సినిమా స్టార్ట్ చేసినప్పటి నుంచే దానిపై ఓ కన్నేసింది టీడీపీ. నిజానికి ఈ సినిమా అనౌన్స్మెంట్‌ నుంచి రోజూ వివాదమే.. టీజర్ వచ్చాక.. అది మరింత ఎక్కువయ్యింది. అందులో తమను, తమ పార్టీ అధినేతను కింఛపరిచేలా చిత్రీకరించారంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ పలు మార్లు కోర్టుకెళ్లడం.. సెన్సార్ క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత కూడా కోర్టు ఆ సినిమా విడుదలకు బ్రేక్ వెయ్యడం చివరకు మరోసారి సెన్సార్ ముందుకు పంపడం.. తాజాగా సెన్సార్‌ సభ్యులు కూడా దాన్ని రెండో సారి సెన్సార్ చెయ్యడంతో రేపో మాపో అది కూడా సిల్వర్ స్క్రీన్ పైకి ఎంట్రీ ఇవ్వనుంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ నెల 16న వ్యూహాన్ని తెరపైకి తీసుకొచ్చేందుకు దర్శక నిర్మాతలు ట్రై చేస్తున్నారు కూడా.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..

Follow us