PM Modi: బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ ఒక్కటే.. అబ్ కీ బార్ మోదీ సర్కార్..

|

Mar 16, 2024 | 1:16 PM

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణపై భారతీయ జనతా పార్టీ స్పెషల్‌ ఫోకస్‌ పెట్టింది. ఎంపీ ఎలక్షన్లను సీరియస్‌గా తీసుకున్న కమలం పార్టీ వరుస సభలతో హోరత్తిస్తోంది. ఈ నేపథ్యంలో శుక్రవారం మల్కాజ్‌గిరి రోడ్‌షోలో పాల్గొన్న మోదీ.. ఈరోజు నాగర్‌కర్నూలులో జరుగుతున్న బీజేపీ విజయ సంకల్ప సభలో పాల్గొన్నారు.

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణపై భారతీయ జనతా పార్టీ స్పెషల్‌ ఫోకస్‌ పెట్టింది. ఎంపీ ఎలక్షన్లను సీరియస్‌గా తీసుకున్న కమలం పార్టీ వరుస సభలతో హోరత్తిస్తోంది. ఈ నేపథ్యంలో శుక్రవారం మల్కాజ్‌గిరి రోడ్‌షోలో పాల్గొన్న మోదీ.. ఈరోజు నాగర్‌కర్నూలులో జరుగుతున్న బీజేపీ విజయ సంకల్ప సభలో పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మోదీ శనివారం ఉదయం 11 గంటలకు నాగర్‌కర్నూలుకు చేరుకుని భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఎస్సీ రిజర్వ్డ్‌ అయిన నాగర్ కర్నూల్ పార్లమెంట్ సీటుపై గురి పెట్టింది కమలం పార్టీ. ఇటీవలే పార్టీలో చేరిన సిట్టింగ్ ఎంపీ రాములు కుమారుడు, కల్వకుర్తి జడ్పీటీసీ భరత్ ప్రసాద్‌ను అభ్యర్థిగా ప్రకటించి ప్రచార పర్వంలో దూసుకుపోతోంది. మోదీ మోనియా, బీజేపీ సానుకూల వేవ్‌తో రిజర్వ్డ్ స్థానాన్ని తొలిసారి కైవసం చేసుకునేలా పావులు కదుపుతోంది. నాగర్‌కర్నూలులో జరుగుతున్న ప్రధాని సభను.. సూపర్‌ హిట్‌ చేసేందుకు కమలం పార్టీ చర్యలు తీసుకుంది. భారీగా జనసమీకరణ చేపట్టింది. నాగర్‌కర్నూలులో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. తెలంగాణలో 17కి 17 స్థానాలను గెలిపించాలని కోరారు. దేశంలో మరోసారి మోదీ సర్కారే అంటూ పేర్కొన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..