తెలంగాణలో ప్రధాని మోదీ 'హైస్పీడ్' పర్యటన.. నిజామాబాద్ 'రోడ్ మ్యాప్' వివరాలివే..

తెలంగాణలో ప్రధాని మోదీ ‘హైస్పీడ్’ పర్యటన.. నిజామాబాద్ ‘రోడ్ మ్యాప్’ వివరాలివే..

Ashok Bheemanapalli

| Edited By: Ravi Kiran

Updated on: Oct 02, 2023 | 6:46 PM

ఒక్క రోజు గ్యాప్.. వరుసగా రెండోసారి తెలంగాణలో సుడిగాలి పర్యటన చేయనున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. అక్టోబర్ 3వ తేదీన నిజామాబాద్ జిల్లా పర్యటనకు వస్తున్న ప్రధాని మోదీ.. వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలలో పాల్గొననున్నారు. ఇక ఆ షెడ్యూల్‌కు సంబంధించి పూర్తి మినిట్ టూ మినిట్ వివరాలు ఇలా ఉన్నాయి.. మీరూ ఓ లుక్కేయండి.

హైదరాబాద్, అక్టోబర్ 2: ఒక్క రోజు గ్యాప్.. వరుసగా రెండోసారి తెలంగాణలో సుడిగాలి పర్యటన చేయనున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. అక్టోబర్ 3వ తేదీన నిజామాబాద్ జిల్లా పర్యటనకు వస్తున్న ప్రధాని మోదీ.. వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలలో పాల్గొననున్నారు. ఇక ఆ షెడ్యూల్‌కు సంబంధించి పూర్తి మినిట్ టూ మినిట్ వివరాలు ఇలా ఉన్నాయి.. మీరూ ఓ లుక్కేయండి.

షెడ్యూల్ వివరాలు ఇలా ఉన్నాయి..

  • మధ్యాహ్నాం 2:10 నిమిషాలకు.. బీదర్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోనున్న ప్రధాని మోదీ
  • 2:55 నిమిషాలకు.. బీదర్ ఎయిర్‌పోర్ట్ నుంచి బయల్దేరి ప్రత్యేక హెలికాప్టర్‌లో నిజామాబాద్‌కు చేరుకుంటారు
  • 3:00 నుంచి 3:35 గంటల వరకు వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేస్తారు
  • 3:45 నుంచి 4:45 గంటల వరకు పబ్లిక్ మీటింగ్‌లో పాల్గొంటారు
  • 4:55 గంటలకు నిజామాబాద్ నుంచి బయలుదేరి 5:45 గంటలకు బీదర్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోనున్న మోదీ.. అనంతరం ఢిల్లీకి తిరుగు ప్రయాణం అవుతారు.

మోదీ ప్రారంబించనున్న అభివృద్ధి కార్యక్రమాల వివరాలు..

  • నిజామాబాద్ పర్యటనలో 8 వేల 21కోట్ల అభివృద్ధి పనులను ప్రజలకు అంకితం చేస్తారు
  • రామగుండంలో నిర్మించిన 8 వందల మెగావాట్ల ఎన్టీపీసీ విద్యుత్ ప్లాంట్‌ను ప్రారంభిస్తారు
  • అల్ట్రా సూపర్ క్రిటికల్ సాంకేతికతను ఈ ప్రాజెక్టులో ఉపయోగించడం జరిగింది.
  • ఈ ప్రాజెక్టులో బొగ్గు వినియోగం తక్కువ.. విద్యుత్ ఉత్పత్తి ఎక్కువగా ఉంటుంది
  • 1360కోట్లతో 496 బస్తీ దావాఖానాలకు, 50 పడకల క్రిటికల్ కేర్ బ్లాక్‌లను మోదీ ప్రారంభిస్తారు
  • అలాగే ప్రతీ జిల్లాలో నిర్మించే పనులను మోదీ వర్చువల్‌గా ప్రారంభిస్తారు
  • 305 కోట్లతో నిర్మితమైన రైల్వే విద్యుత్ లైన్‌ను ప్రజలకు అంకితం చేస్తారు
  • కొమురవెల్లి దేవస్థానం వద్ద రైల్వే స్టేషన్ ఏర్పాటు చేయనుంది కేంద్రం

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..