AP Politics: ఏపీలో కొత్త పొత్తు లెక్కలు..  కర్నాటక ఫలితాలతో ఏపీలో మారిన పొత్తుల లెక్క..

AP Politics: ఏపీలో కొత్త పొత్తు లెక్కలు.. కర్నాటక ఫలితాలతో ఏపీలో మారిన పొత్తుల లెక్క..

Anil kumar poka

|

Updated on: May 15, 2023 | 8:45 AM

అనుమానాలు తొలిగిపోతున్నాయి. డౌట్లపై క్లారిటీ వస్తోంది. టైమ్ గడుస్తున్న కొద్దీ పిక్చర్ క్లియర్ అవుతోంది. ఎపీలో పొత్తుపొడుపుల కథా చిత్రమ్ క్లైమాక్స్‌కు చేరుకున్నట్లే కనిపిస్తోంది. కర్నాటక రిజల్ట్స్ తర్వాత బీజేపీ ఆలోచన కూడా మారుతోందా?

ఎన్నికలు తరుముకొస్తున్నాయి. ఏపీ రాజకీయాలు మరింత రంజుగా మారుతున్నాయి. సింహం సింగిల్‌గానే వస్తుందని ఎప్పుడో క్లారిటీ ఇచ్చేసింది అధికార వైసీపీ. ఎటొచ్చీ తేల్చుకోవాల్సింది విపక్షాలే. గత కొన్ని రోజులుగా ఈ విషయంలో చర్చోపచర్చలు జరుగుతూనే ఉన్నాయి. రోజుకో టీజర్‌ వస్తూనే ఉంది. కానీ అదే సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది. పొత్తులు ఖాయం అని తెలుస్తున్నా..ఆ ముగ్గురు పాత మిత్రులు మళ్లీ ఒక్కటవుతారా లేదా అన్నదే అసలు ప్రశ్న. పొత్తుల విషయంలో టీడీపీ-జనసేన స్పష్టతతోనే ఉన్నాయి. బీజేపీ నుంచి అందాల్సిన సిగ్నల్సే ఆలస్యం అవుతున్నాయి. అయితే కర్నాటక రిజల్ట్స్ తర్వాత కమలనాథులు కూడా పునరాలోచనలో పడ్డారా అన్న చర్చ మొదలైంది. ఏపీలోని పరిస్థితిపై ఢిల్లీ పెద్దలు ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారట. త్వరలోనే పవన్ కోరుకునే కాంబినేషన్‌కు గ్రీన్‌సిగ్నల్ వస్తుందన్న టాక్ నడుస్తోంది. అటు టీడీపీతో పొత్తు అంశాన్ని పవన్, బీజేపీ హైకమాండ్ దగ్గర కూడా ప్రస్తావించినట్లు జీవీఎల్ చెప్పడం మారబోయే ఈక్వేషన్స్‌కు సంకేతంగా చూడొచ్చంటున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Jagapathi Babu – Rajinikanth: రజినీకాంత్ పై రాజకీయ విమర్శలు.. జగపతి బాబు రియాక్షన్..

Akhil Akkineni: ఒంటరైపోయిన అఖిల్.. డిప్రెషన్లో మరో దేశానికి..! ఎయిర్ పోర్ట్ లో వీడియో..

Naga Chaitanya vs Nagarjuna: ఆ విషయంలో తండ్రికి ఎదురునిలుస్తున్న నాగచైతన్య..!