Nara Lokesh vs YCP: చిరంజీవి మాటల్లో తప్పేముంది? వైసీపీపై నారా లోకేష్ విమర్శలు..!

Nara Lokesh vs YCP: చిరంజీవి మాటల్లో తప్పేముంది? వైసీపీపై నారా లోకేష్ విమర్శలు..!

Anil kumar poka

|

Updated on: Aug 10, 2023 | 8:10 AM

‘వాల్తేరు వీరయ్య’ 200 రోజుల ఫంక్షన్‌లో ఆంధ్రప్రదేశ్‌ సర్కారుపై మెగాస్టార్‌ చిరంజీవి చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగింది. పిచ్చుక లాంటి సినిమా ఇండస్ట్రీపై బ్రహ్మాస్త్రం ఎందుకుని, ప్రజా సంక్షేమంపై ఏపీ ప్రభుత్వం దృష్టి పెట్టాలని చిరంజీవి సూచించారు. ప్రత్యేక హోదా, ప్రాజెక్టులు, రోడ్ల నిర్మాణంపై దృష్టి పెడితే ప్రజలు గుండెల్లో పెట్టుకుని చూసుకుంటారన్నారు. అయితే..

‘వాల్తేరు వీరయ్య’ 200 రోజుల ఫంక్షన్‌లో ఆంధ్రప్రదేశ్‌ సర్కారుపై మెగాస్టార్‌ చిరంజీవి చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగింది. పిచ్చుక లాంటి సినిమా ఇండస్ట్రీపై బ్రహ్మాస్త్రం ఎందుకుని, ప్రజా సంక్షేమంపై ఏపీ ప్రభుత్వం దృష్టి పెట్టాలని చిరంజీవి సూచించారు. అయితే ఈ వ్యాఖ్యలపై ఏపీ మంత్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏపీకి అన్యాయం చేసిన వారిలో చిరంజీవి కూడా ఒక్కరంటూ ఆయనపై మండిపడుతున్నారు. ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల, మంత్రులు రోజా, కొడాలినాని, అంబటి రాంబాబు, అమర్నాథ్‌, సీదిరి అప్పలరాజు, బొత్స సత్యనారాయణ, ఎంపీ నందిగం సురేష్‌.. ఇలా వైసీపీ నాయకులు చిరంజీవి వ్యాఖ్యలకు కౌంటర్లిస్తున్నారు.

మరోవైపు చిరంజీవి కామెంట్స్‌కు మద్దతుగా పలువురు టీడీపీ నాయకులు ముందుకొస్తున్నారు. మాజీ మంత్రులు గంటా శ్రీనివాసరావు, కొత్త పల్లి సుబ్బారాయుడు మెగాస్టార్‌కు మద్దతుగా నిలిచారు. చిరంజీవి అన్నదాంట్లో తప్పేముందంటూ వైసీపీ నాయకులకు కౌంటర్లిచ్చారు. తాజాగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ ఈ వ్యవహారంపై స్పందించారు. యువగళం పాదయాత్రలో మాట్లాడిన ఆయన మెగాస్టార్‌ చిరంజీవి మద్దతునిస్తూనే వైసీపీ నాయకులపై విరుచుకుపడ్డారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌...