KTR: తెలంగాణ అగ్ర రాష్ట్రంగా ఎదిగింది.. 2023లో పేదరికం 5 శాతానికి తగ్గింది.. కేటీఆర్
తెలంగాణలో శ్వేతపత్రాలపై కాంగ్రెస్-బీఆర్‌ఎస్ మధ్య సవాళ్ల పర్వం కొనసాగుతోంది. మొన్నటివరకూ అసెంబ్లీలో రచ్చ జరిగితే...ఇప్పుడు సభ వెలుపల కూడా ఫైట్ నడుస్తోంది. కాంగ్రెస్ శ్వేతపత్రాలతో విపక్షాలను ఇరుకునపెట్టే ప్రయత్నం చేస్తే...ఇప్పుడు స్వేదపత్రంతో బీఆర్‌ఎస్ అధికార కాంగ్రెస్‌కు సవాల్ విసురుతోంది. తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రం తప్పుల తడక అని మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు.
తెలంగాణలో శ్వేతపత్రాలపై కాంగ్రెస్-బీఆర్‌ఎస్ మధ్య సవాళ్ల పర్వం కొనసాగుతోంది. మొన్నటివరకూ అసెంబ్లీలో రచ్చ జరిగితే…ఇప్పుడు సభ వెలుపల కూడా ఫైట్ నడుస్తోంది. కాంగ్రెస్ శ్వేతపత్రాలతో విపక్షాలను ఇరుకునపెట్టే ప్రయత్నం చేస్తే…ఇప్పుడు స్వేదపత్రంతో బీఆర్‌ఎస్ అధికార కాంగ్రెస్‌కు సవాల్ విసురుతోంది. తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రం తప్పుల తడక అని మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. తొమ్మిదిన్నరేళ్ల బీఆర్ఎస్ పాలనపై తెలంగాణ భవన్‌లో స్వేదపత్రం విడుదల చేసిన కేటీఆర్.. తెలంగాణ ఆవిర్భావానికి ముందు.. ఆవిర్భావం తర్వాత పరిస్థితులను వివరించారు. తెలంగాణ అగ్రరాష్ట్రంగా ఎదిగిందని కేటీఆర్ పేర్కొన్నారు. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే హిమాలయ పర్వం అంత ఎత్తున ఉందన్నారు. తెలంగాణ రాష్ట్ర అప్పు రూ. 3.17 లక్షల కోట్లే అని.. ప్రభుత్వం శ్వేతపత్రంలో రూ. 6.71 లక్షల కోట్లుగా చూపిందన్నారు. విద్యుత్ రంగంలో రూ.6 లక్షల కోట్ల సంపద సృష్టించామన్నారు. 2014లో రాష్ట్ర తలసరి ఆదాయం రూ.1.14 లక్షలు .. 2023లో తలసరి ఆదాయం రూ.3.17 లక్షలన్నారు. 2013లో పేదరికం 21 శాతం ఉండగా.. 2023లో పేదరికం 5 శాతానికి తగ్గిందంటూ కేటీఆర్ పేర్కొన్నారు. KCR అంటూ కాల్వలు, చెరువులు, రిజర్వాయిర్లు అంటూ కేటీఆర్ పేర్కొన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..