సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ సరికొత్త ప్రస్థానం.. పొలం కౌలుకు తీసుకున్న మాజీ జేడీ వీడియో.:jd laxminarayana video.

Anil kumar poka

|

Updated on: Jun 25, 2021 | 3:28 PM

JD Laxminarayana: ఆ చేతులతో ఎంతో మంది జీవితాలనే తారు మారులు చేశారు.. ఆ చేతులతో ఎంతో మంది అక్రమార్కుల ఆట కట్టించారు.. ఆ చేతులతో ఎంతోమందిని ఖైదు చేయించారు.. ఆ చేతులతోనే ఎంతో మందిచే ఆదర్శపాఠాలు దిద్దించారు.


JD Laxminarayana: ఆ చేతులతో ఎంతో మంది జీవితాలనే తారు మారులు చేశారు.. ఆ చేతులతో ఎంతో మంది అక్రమార్కుల ఆట కట్టించారు.. ఆ చేతులతో ఎంతోమందిని ఖైదు చేయించారు.. ఆ చేతులతోనే ఎంతో మందిచే ఆదర్శపాఠాలు దిద్దించారు. ఇప్పుడు అదే చేతులతో తన జీవితంలో సరికొత్త ప్రస్థానానికి నాంది పలికారు. ఆయనే సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ. ఇప్పటికే సీబీఐకి వాలంటరీ రిటైర్మెంట్ ప్రకటించి రాజకీయ అరంగేట్రం చేసిన లక్ష్మీనారాయణ.. ఇప్పుడు సరికొత్త జీవితాన్ని ప్రారంభించారు. ఏరువాక పౌర్ణమి సందర్భంగా.. నాగలి పట్టి రైతుగా మారారు. ఎడ్ల నాగలితో దుక్కి దున్ని వ్యవసాయ పనులు మొదలు పెట్టారు. ప్రత్తిపాడు మండలం ధర్మవరంలో 12 ఎకరాలు కౌలుకు తీసుకున్న లక్ష్మీనారాయణ.. నేటి నుంచి సాగు చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ నిర్ణయంలో భాగంగానే ఇవాళ్టి నుంచి ఆయన వ్యవసాయ పనులు ప్రారంభించారు.
మరిన్ని ఇక్కడ చూడండి: ఆఫ్రికన్ పైథాన్‌ వర్సెస్ చిరుత..గెలిచిన తల్లి ప్రేమ..వైరల్ అవుతున్న వీడియో :Python vs leopard video.

200 కోట్లా..!చాల తక్కువ..మన రేంజ్ వేరసలు..విజయ్ దేవరకొండ ఏం చెబుతున్నాడంటే..?:Liger Video.

క్రేజీ ఫ్యాన్ రష్మిక కోసం 900 కిలోమీటర్ల ప్రయాణం.చివరకు నిరాశ ఎదుర్కున్న అభిమాని వీడియో :Rashmika Mandanna Fan Video

నాచురల్ స్టార్ నాని మూవీ లో విలన్ గా కనిపించనున్న హీరోయిన్ సాయి పల్లవి :Sai pallvi as vilan video.