Gujarat Exit Poll Result 2022:  గుజరాత్ లో మళ్లీ బీజేపీ ??

Gujarat Exit Poll Result 2022: గుజరాత్ లో మళ్లీ బీజేపీ ??

Phani CH

|

Updated on: Dec 05, 2022 | 7:22 PM

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యాయి. డిసెంబర్ 8న (గురువారం) ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. 182 స్థానాలున్న గుజరాత్‌ అసెంబ్లీకి.. మొదటి విడతలో 89 స్థానాల్లో ఓటింగ్ జరగగా..

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యాయి. డిసెంబర్ 8న (గురువారం) ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. 182 స్థానాలున్న గుజరాత్‌ అసెంబ్లీకి.. మొదటి విడతలో 89 స్థానాల్లో ఓటింగ్ జరగగా.. 93 స్థానాల్లో ఈ రోజు పోలింగ్‌ పూర్తయింది. గుజరాత్‌లో బీజేపీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మధ్య త్రిముఖ పోరు నెలకొంది. బీజేపీ వరుసగా ఏడోసారి అధికారం సొంతంచేసుకునేందుకు తీవ్రంగా శ్రమించింది. స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రంగంలోకి దిగి ప్రచారం నిర్వహించడంతో.. బీజేపీ మరోసారి గుజరాత్ పీఠాన్ని కైవసం చేసుకోనుందని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. గుజరాత్‌లో మోడీ హవానే కొనసాగిందని పీపుల్స్‌ పల్స్‌ సంస్థ నిర్వహించిన ఎగ్జిట్‌ పోల్స్‌ సర్వేలో వెల్లడైంది. గుజరాత్‌లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఎప్పటిలాగే మోదీ హవా కొనసాగింది. పీపుల్స్‌ పల్స్‌ సంస్థ నిర్వహించిన ఎగ్జిట్ పోల్ సర్వే ప్రకారం.. గుజరాత్ లో బీజేపీకి 125-143, కాంగ్రెస్ 30-48, ఆమ్ ఆద్మీ పార్టీకి 3-7, ఇతరులకు 2-6 సీట్లు వచ్చే అవకాశం ఉంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

హైపర్ ఆదికి పెళ్లైపోయిందా ?? నెట్టింట షేకాడిస్తున్న పెళ్లి ఫోటో

Adivi Sesh: ఆ క్షణం నా కళ్లలో నీళ్లు తిరిగాయి !!

Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి షూటింగ్‌లో ఘోర ప్రమాదం !!

Mahesh Babu: బాధను దిగమింగి.. కోట్లమంది కోసం కదిలిన మహేష్ !!

తారక్ ట్వీట్‌కు జక్కన్న షాకింగ్ రిప్లై !! ఓ రేంజ్లో ఖుసీ అవుతున్న ఫ్యాన్స్

Published on: Dec 05, 2022 07:22 PM