ఓటు ప్రజాస్వామ్యాన్ని కాపాడే ఆయుధం అంటూ అవగాహనా కార్యక్రమం..
ప్రజాస్వామ్యాన్ని కాపాడే ఆయుధం ఓటు హక్కు అని అటువంటి ఆయుధాన్ని ప్రజలందరూ ఖచ్చితంగా వినియోగించుకోవాలని ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ చిరంజీవి అన్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఓటు హక్కు అవగహన ర్యాలీని ఎన్నికల అధికారి చిరంజీవి, తహసీల్దార్ శేషిరెడ్డి, మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డిలు జెండా ఊపి ప్రారంభించారు.
ప్రజాస్వామ్యాన్ని కాపాడే ఆయుధం ఓటు హక్కు అని అటువంటి ఆయుధాన్ని ప్రజలందరూ ఖచ్చితంగా వినియోగించుకోవాలని ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ చిరంజీవి అన్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఓటు హక్కు అవగహన ర్యాలీని ఎన్నికల అధికారి చిరంజీవి, తహసీల్దార్ శేషిరెడ్డి, మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డిలు జెండా ఊపి ప్రారంభించారు. మున్సిపల్ కార్యాలయం నుండి సోమప్ప కూడలి వరకు ర్యాలీ నిర్వహించి ఓటు హక్కుపై అవగహన కల్పించారు. సోమప్ప కూడలిలో ర్యాలీలో పాల్గొన్న ఓటర్లతో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఎన్నికల అధికారి చిరంజీవి మాట్లాడుతూ.. ఓటర్లు అందరూ వారి బాధ్యతగా మే 13న జరిగే పోలింగ్కి ఎక్కువ సంఖ్యలో పాల్గొని తమ ఓటు హక్కుని వినియోగించుకోవాలని సూచించారు. మన భవిష్యత్తును నిర్దేశించుకునే విధంగా ప్రజాస్వామ్యానికి సహకరించాలని కోరారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడి క్లిక్ చేయండి..
క్రిమినల్ లాయర్కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా
ప్రపంచంలో అత్యంత శీతల ప్రాంతం ఈ గ్రామం..
జీపీఎస్ ట్రాకర్తో కనిపించిన రాబందు.. ఎక్కడినుంచి వచ్చిందంటే
పావురానికి ప్రాణం పోసిన కానిస్టేబుల్!
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
మీ ఇంటికే మేడారం ప్రసాదం.. ఆర్టీసీ కొత్త ఆఫర్
పల్లె పడతులు వర్సెస్ పట్నం భామలు..సై అంటే సై..!

