Watch Video: రైతుల కోసం బీఆర్ఎస్ నిరసన.. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో రాస్తారోకో..

|

May 16, 2024 | 2:16 PM

తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు రోడ్డెక్కాయి. నల్ల బ్యాడ్జీలతో నిరసనలు తెలిపాయి. అన్ని జిల్లాలో రోడ్లపై బైటాయించి ప్రభ్వుత్వ వైఖరికి వ్యతిరేకంగా నిరసన గళాన్ని వినిపిస్తున్నాయి. రైతుల ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. తడిచిన ధాన్యం మొత్తం ప్రభుత్వమే కొనుగోలు చేయాలని కోరుతున్నారు. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లు క్వింటాల్ ధాన్యానికి 500 రూపాయల బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.

తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు రోడ్డెక్కాయి. నల్ల బ్యాడ్జీలతో నిరసనలు తెలిపాయి. అన్ని జిల్లాలో రోడ్లపై బైటాయించి ప్రభ్వుత్వ వైఖరికి వ్యతిరేకంగా నిరసన గళాన్ని వినిపిస్తున్నాయి. రైతుల ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. తడిచిన ధాన్యం మొత్తం ప్రభుత్వమే కొనుగోలు చేయాలని కోరుతున్నారు. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లు క్వింటాల్ ధాన్యానికి 500 రూపాయల బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై రైతులు కూడా అక్కడక్కడా రోడుపై కూర్చొని నిరసన తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగ వ్యతిరేక చర్యలకు నిరసనగా బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్ నేడు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చారు.

ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో, జిల్లా కేంద్రాల్లో నల్ల బ్యాడ్జీలను ధరించి, ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి ర్యాలీ చేపట్టారు. అకాల వర్షం కారణంగా రైతులు కొనుగోలు కేంద్రాల వద్ద తీసుకొచ్చిన ధాన్యం తడిసిపోయిందని.. దీనికి కారణం అధికారులు కొనుగోలులో చేపట్టిన జాప్యమే అని చెబుతున్నారు. రైతులకు మద్దతు ధర ఇవ్వకుంటే ఊరుకునేదే లేదని పలు జిల్లాల్లో నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సంగారెడ్డి, మెదక్, పెద్దపల్లి, సిద్దిపేట జిల్లాల్లో బీఆర్ఎస్ కార్యకర్తలు రాస్తారోకోలు నిర్వహించారు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వ తీరు మారకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..