Big News Big Debate: ఏపీ రాజకీయాల్లో కొత్త జోష్.. పొత్తులు, ఎత్తులతో ముందుకు వెళ్తున్న పార్టీలు

Big News Big Debate: ఏపీ రాజకీయాల్లో కొత్త జోష్.. పొత్తులు, ఎత్తులతో ముందుకు వెళ్తున్న పార్టీలు

Anil kumar poka

|

Updated on: May 09, 2022 | 7:00 PM

ఏపీలో ఎన్నికలకు సరిగ్గా రెండేళ్లున్నాయి. కాని, రేపే ఎన్నికలన్నట్లుగా మారింది పొలిటికల్‌ వెదర్‌. అధికార పార్టీ గడపగడపకూ వెళ్తుంటే.. టీడీపీ, బాదుడే బాదుడంటూ కొత్త కాన్సెప్టులతో జనం ముందుకు వెళ్తోంది. ఇంకోవైపు పవన్‌ దూకుడు కన్నా.. వ్యూహం ముఖ్యమని చెబుతూనే..



ఇప్పటి వరకు జనసేన ఏ పార్టీతో ఎప్పుడు పొత్తు పెట్టుకుందో చూస్తే 2014 ఎన్నికల్లో TDP, BJPతో పొత్తు పెట్టుకున్నా జనసేన పోటీ మాత్రం చేయలేదు. 2017 వరకు కలిసే ఉన్నా ఆ తర్వాత క్రమంగా బీజేపీ, టీడీపీలకు దూరమవుతూ వచ్చారు జనసేనాని. 2018లో వామపక్షాలతో కలిసి పని చేశారు. కొన్ని ఆందోళనలు చేశారు. 2019 ఎన్నికల్లో లెఫ్ట్‌తోపాటు BSPతో పొత్తు పొట్టుకుని ఒకే ఒక్క చోట గెలిచారు. ఆ ఎన్నికల్లో టీడీపీ బలంగా ఉన్న చోట జనసేన బలహీన అభ్యర్థులను పెట్టడం చర్చనీయాంశమైంది. 2020కి వచ్చే సరికి మళ్లీ బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు పవన్‌ కల్యాణ్‌. మున్సిపల్‌, పంచాయతీ ఎన్నికల్లోనూ కమలనాధులతోనే కలిసి వెళ్లారు. ఇప్పుడు కొత్తగా మరో రాగం అందుకున్నారు పవన్‌ కల్యాణ్‌. 2024 ఎన్నికల్లో ప్రభుత్వ ఓటును చీలనివ్వబోమని చెబుతున్నారు. అంటే టీడీపీతో పొత్తు పెట్టుకుంటామని చెప్పకనే చెబుతున్నారా అనే చర్చ జరుగుతోంది. ఒకవైపు బీజేపీతో పొత్తులో ఉండగానే టీడీపీకి దగ్గరవడానికి జనసేనాని ప్రయత్నిస్తున్నారన్న ప్రచారం నడుస్తోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Funny Video: అది లెక్క..! నిజంగా వేడు మగాడ్రా బుజ్జి.. అభినవ పరమానందయ్య శిష్యుడు..! చూస్తే పొట్టచెక్కలే..

Funny Viral video: సమ్మర్‌లో సూపర్‌ టెక్నిక్‌.. వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేక గాల్లో తేలిపోతారు..!

Viral Video: ఎందుకో అంత తొందర.. పెళ్లి మండపం వరకు ఆగలేక విమానంలో పెళ్లి ఆ తరువాత…

Tigers Video: ప్రేమ యవ్వారం ముదిరితే ఇంతే.. ఆడ పులి కోసం బీభత్సంగా పోట్లాడుకున్న రెండు మగ పులులు..