Arvind Kejriwal: ఎలక్షన్స్ ముందు కేజ్రీవాల్ అరెస్ట్‌ పై ఐక్యరాజ్యసమితి రియాక్షన్.! వీడియో.

Arvind Kejriwal: ఎలక్షన్స్ ముందు కేజ్రీవాల్ అరెస్ట్‌ పై ఐక్యరాజ్యసమితి రియాక్షన్.! వీడియో.

Anil kumar poka

|

Updated on: Apr 01, 2024 | 12:19 PM

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్‌పై ఇప్పటికే జర్మనీ, అమెరికా స్పందించగా, తాజాగా ఐక్యరాజ్య సమితి స్పందించింది. కాంగ్రెస్‌ పార్టీ బ్యాంకు ఖాతాల వ్యవహారాన్నీ అమెరికా ప్రస్తావించింది. దీనిపై భారత్‌ తన వైఖరిని స్పష్టం చేసింది. ఇవి పూర్తిగా దేశ అంతర్గత విషయాలని.. దేశ సార్వభౌమత్వాన్ని గౌరవించాలని దీటుగానే బదులిచ్చింది. ఈ విషయంలో ఇతర దేశాల జోక్యాన్ని ఏమాత్రం ఆమోదించబోమని తేల్చి చెప్పింది.

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్‌పై ఇప్పటికే జర్మనీ, అమెరికా స్పందించగా, తాజాగా ఐక్యరాజ్య సమితి స్పందించింది. కాంగ్రెస్‌ పార్టీ బ్యాంకు ఖాతాల వ్యవహారాన్నీ అమెరికా ప్రస్తావించింది. దీనిపై భారత్‌ తన వైఖరిని స్పష్టం చేసింది. ఇవి పూర్తిగా దేశ అంతర్గత విషయాలని.. దేశ సార్వభౌమత్వాన్ని గౌరవించాలని దీటుగానే బదులిచ్చింది. ఈ విషయంలో ఇతర దేశాల జోక్యాన్ని ఏమాత్రం ఆమోదించబోమని తేల్చి చెప్పింది. దేశ ప్రజాస్వామ్య వ్యవస్థలు ఇక్కడి చట్టాల ప్రకారమే నడుచుకుంటాయని అమెరికా దౌత్యవేత్తకు సమన్లు కూడా జారీ చేసింది. ఇది జరిగిన ఒకరోజు వ్యవధిలోనే ఐక్యరాజ్యసమితి స్పందించింది. ఎన్నికలు జరిగే ఇండియా సహా ఇతర దేశాల్లో ప్రజల రాజకీయ, పౌర హక్కులు రక్షించబడతాయని బలమైన విశ్వాసాన్ని కనబరుస్తున్నట్టు ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ అంటోనియో గుటెరెస్ అధికార ప్రతినిధి స్టెఫానే డుజారిక్ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరు స్వేచ్ఛగా, న్యాయంగా ఓటు వేసే వాతావరణం ఉంటుందని విశ్వసిస్తున్నట్టు తెలిపారు. కేజ్రీవాల్ అరెస్ట్, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాల స్తంభనతో లోక్‌సభ ఎన్నికలకు ముందు భారత్‌లో నెలకొన్న రాజకీయ అశాంతిపై అడిగిన ప్రశ్నకు ఆయన పై విధంగా స్పందించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.

ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.

‘నా భర్త VDలా ఉండాలి.!’ నో కన్ఫూజన్‌ తెలిసిన కాంబినేషనేగా..