BR Ambedkar Statue: 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన కేసీఆర్.. వీడియో.
హైదరాబాద్ ట్యాంక్‌బండ్ పరిసరాల్లో పండుగ వాతావరణం నెలకొంది. భారత రాజ్యాంగ నిర్మాత, స్ఫూర్తి ప్రదాత..డాక్టర్ బీఆర్.అంబేద్కర్ 125 అడుగుల విగ్రహ ఆవిష్కరణ, ఆయన జయంతి రోజే జరగడం చరిత్రలో నిలిచిపోయే రోజు.
హైదరాబాద్ ట్యాంక్‌బండ్ పరిసరాల్లో పండుగ వాతావరణం నెలకొంది. భారత రాజ్యాంగ నిర్మాత, స్ఫూర్తి ప్రదాత..డాక్టర్ బీఆర్.అంబేద్కర్ 125 అడుగుల విగ్రహ ఆవిష్కరణ, ఆయన జయంతి రోజే జరగడం చరిత్రలో నిలిచిపోయే రోజు. భారీ అంబేద్కర్ విగ్రహాన్ని బీఆర్‌ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ ఆవిష్కరించడం మరో చారిత్రాత్మకం. అంతేకాదు.. బాబాసాహెబ్ అంబేద్కర్ మనవడు ప్రకాశ్ అంబేద్కర్, బౌద్ధగురువులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బౌద్ధగురువులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఫొటో ఎగ్గిబిషన్‌ను సీఎం కేసీఆర్, ప్రకాశ్ అంబేద్కర్, మంత్రులు, ప్రజాప్రతినిధులు తిలకించారు. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు తెలంగాణ వ్యాప్తంగా జనం పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.ట్యాంక్‌బండ్ పరిసరాల్లో హెలికాప్టర్ చక్కర్లు కొట్టింది. అంబేద్కర్ భారీ విగ్రహంపై పూల వర్షం కురిపించింది. దాదాపు 146 కోట్లతో అంబేద్కర్ విగ్రహాన్ని తెలంగాణ సర్కార్ ప్రతిష్ఠాత్మకంగా నిర్మించింది. మొత్తం 11.7 ఎకరాల స్థలంలో అంబేద్కర్ స్మృతివనంలో ఈ విగ్రహం ఏర్పాటు చేశారు. విగ్రహం చుట్టూ 2.93 ఎకరాల్లోల్యాండ్ స్కేపింగ్, గ్రీనరీ ఏర్పాటు చేశారు. విగ్రహం కింది భాగంలో అంబేద్కర్ ఫొటో గ్యాలరీ, మ్యూజియం, ఆడియో విజువల్ గది ఏర్పాటు చేశారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Lati Charge on Allu Arjun Fans: అర్థరాత్రి పోలీసోళ్లకు చుక్కలే..! ఏమాత్రం తగ్గని బన్నీ ఫ్యాన్స్..