PM Modi: వయనాడ్‌లో ప్రధాని మోదీ.. బాధిత విద్యార్థుల్ని చూసి చలించిన ప్రధాని.

వయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడిన ప్రాంతంలో ప్రధాని నరేంద్రమోదీ శనివారం పర్యటించారు. ప్రధాని మోదీ వెంట కేరళ సీఎం పినరయి విజయన్, కేంద్రమంత్రి సురేశ్ గోపి ఉన్నారు. పునరావాస కేంద్రంలో తలదాచుకున్న బాధితులను పరామర్శించారు. ప్రధాని మోదీ కాల్‌పేటలో అడుగిడిన తర్వాత జీవీహెచ్ఎస్ స్కూల్‌లో తలదాచుకున్న బాధితులను కలుసుకున్నారు.

PM Modi: వయనాడ్‌లో ప్రధాని మోదీ.. బాధిత విద్యార్థుల్ని చూసి చలించిన ప్రధాని.

|

Updated on: Aug 12, 2024 | 5:06 PM

వయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడిన ప్రాంతంలో ప్రధాని నరేంద్రమోదీ శనివారం పర్యటించారు. ప్రధాని మోదీ వెంట కేరళ సీఎం పినరయి విజయన్, కేంద్రమంత్రి సురేశ్ గోపి ఉన్నారు. పునరావాస కేంద్రంలో తలదాచుకున్న బాధితులను పరామర్శించారు. ప్రధాని మోదీ కాల్‌పేటలో అడుగిడిన తర్వాత జీవీహెచ్ఎస్ స్కూల్‌లో తలదాచుకున్న బాధితులను కలుసుకున్నారు. వారిని చూసిన ప్రధాని భావోద్వేగానికి గురయ్యారు. ఈ ఘటనలో ఎంతమంది పిల్లలు చనిపోయారని ఉద్వేగపూరిత గొంతుతో అడిగారు. కొండచరియలు విరిగిపడిన ఘటనలో ఈ స్కూల్ భవనం కూడా కూలిపోయింది. దెబ్బతిన్న పాఠశాల భవంతిని, అక్కడున్నవారిని చూసి చలించిపోయారు. బాధితుల పునరావాసం గురించి అడిగి తెలుసుకున్నారు.

కొండచరియలు విరిగిపడిన సమయంలో జీవీహెచ్ఎస్ వెల్లర్మల స్కూల్లో 582 మంది విద్యార్థులు ఉండగా ఇందులో 27 మంది గల్లంతైనట్లుగా తెలుస్తోంది. ఈ పాఠశాలలో ప్రధాని మోదీ 15 నిమిషాల పాటు ఉన్నారు. కొత్త పాఠశాల భవన నిర్మాణానికి సంబంధించిన ప్రణాళికలను అడిగి తెలుసుకున్నారు. ప్రధాని మోదీ భారత సైన్యం నిర్మించిన 190 అడుగుల బెయిలీ వంతెనను సందర్శించారు. ఈ వంతెన గుండా నడిచి, రక్షణ అధికారులతో మాట్లాడారు. స్థానిక ఆసుపత్రిని సందర్శించి, బాధితులను పరామర్శించారు. అనంతరం కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్, సీఎం పినరాయి విజయన్, ఇతర అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us
వయనాడ్‌లో ప్రధాని మోదీ. బాధిత విద్యార్థుల్ని చూసి చలించిన ప్రధాని
వయనాడ్‌లో ప్రధాని మోదీ. బాధిత విద్యార్థుల్ని చూసి చలించిన ప్రధాని
అద్దె ఒప్పందం 11 నెలలకే ఎందుకు చేసుకుంటారో తెలుసా.?
అద్దె ఒప్పందం 11 నెలలకే ఎందుకు చేసుకుంటారో తెలుసా.?
ఆ రాయి ఒక గ్రాము ధర రూ.17 కోట్లు.! 50 గ్రాములు 850 కోట్లు..
ఆ రాయి ఒక గ్రాము ధర రూ.17 కోట్లు.! 50 గ్రాములు 850 కోట్లు..
నాగ చైతన్య-శోభితాల జాతకం చెప్పి చిక్కుల్లో పడిన వేణు స్వామి
నాగ చైతన్య-శోభితాల జాతకం చెప్పి చిక్కుల్లో పడిన వేణు స్వామి
ఈ ఒక్క నిర్ణయంతో ముగ్గురు భారత ఆటగాళ్లకు హార్ట్ బ్రేక్..
ఈ ఒక్క నిర్ణయంతో ముగ్గురు భారత ఆటగాళ్లకు హార్ట్ బ్రేక్..
వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స నామినేషన్.. కూటమి అభ్యర్థిపై.!
వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స నామినేషన్.. కూటమి అభ్యర్థిపై.!
జిమ్‌కి వెళ్లే వారు ఈ విషయాలు మస్ట్‌గా తెలుసుకోండి.. బీ కేర్‌ఫుల్
జిమ్‌కి వెళ్లే వారు ఈ విషయాలు మస్ట్‌గా తెలుసుకోండి.. బీ కేర్‌ఫుల్
ఇండిపెండెన్స్‌డే స్పెషల్.. ఈ వారం ఓటీటీల్లో సూపర్ హిట్ సినిమాలు
ఇండిపెండెన్స్‌డే స్పెషల్.. ఈ వారం ఓటీటీల్లో సూపర్ హిట్ సినిమాలు
సీబీఐ అరెస్ట్‌పై సుప్రీంకోర్టును ఆశ్రయించిన కేజ్రీవాల్‌
సీబీఐ అరెస్ట్‌పై సుప్రీంకోర్టును ఆశ్రయించిన కేజ్రీవాల్‌
వైజాగ్ టూ బెంగళూరు.. వయా హైదరాబాద్.!
వైజాగ్ టూ బెంగళూరు.. వయా హైదరాబాద్.!