Californium Stone: ఆ రాయి ఒక గ్రాము ధర రూ.17 కోట్లు.! 50 గ్రాములు 850 కోట్లు..

Californium Stone: ఆ రాయి ఒక గ్రాము ధర రూ.17 కోట్లు.! 50 గ్రాములు 850 కోట్లు..

Anil kumar poka

|

Updated on: Aug 12, 2024 | 5:00 PM

బంగారం కంటే విలువైనది ఏది అంటే ఎవరైనా వజ్రం అనే సమాధానం చెపుతారు. అదే వజ్రం కంటే విలువైనది ఏది అని అడిగితే ప్లాటినం అని అతికొద్ది మంది నుంచి మాత్రమే జవాబు వస్తుంది. ఇక ప్లాటినం కంటే ఖరీదైనది ఏంటి అంటే మాత్రం అబ్బా.. ప్లాటినం కంటే విలువైనది ఉంటుందా అని ఆశ్చర్యంగా చూడటం ఖాయం. కానీ, ఇటివల పోలీసుల తనిఖీల్లో భాగంగా 50 గ్రాముల అత్యంత విలువైన రేడియోధార్మిక పదార్ధం కాలిఫోర్నియంను స్వాధీనం చేసుకున్నారు.

బంగారం కంటే విలువైనది ఏది అంటే ఎవరైనా వజ్రం అనే సమాధానం చెపుతారు. అదే వజ్రం కంటే విలువైనది ఏది అని అడిగితే ప్లాటినం అని అతికొద్ది మంది నుంచి మాత్రమే జవాబు వస్తుంది. ఇక ప్లాటినం కంటే ఖరీదైనది ఏంటి అంటే మాత్రం అబ్బా.. ప్లాటినం కంటే విలువైనది ఉంటుందా అని ఆశ్చర్యంగా చూడటం ఖాయం. కానీ, ఇటివల పోలీసుల తనిఖీల్లో భాగంగా 50 గ్రాముల అత్యంత విలువైన రేడియోధార్మిక పదార్ధం కాలిఫోర్నియంను స్వాధీనం చేసుకున్నారు. అయితే దాని విలువ అంతర్జాతీయ మార్కెట్‌లో సుమారు 850 కోట్ల రూపాయలు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ముగ్గురు స్మగ్లర్లను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

ఒక గ్రాము కాలిఫోర్నియం ధర దాదాపు 17 కోట్ల రూపాయలు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఆ లెక్కన స్వాధీనం చేసుకున్న కాలిఫోర్నియం విలువ దాదాపు 850 కోట్ల రూపాయలు ఉంటుందని వెల్లడించారు. దీనిని ప్రధానంగా అణుశక్తి ఉత్పత్తి, మెదడు క్యాన్సర్ చికిత్సలో ఉపయోగిస్తారని వెల్లడించారు. బిహార్STF, స్పెషల్ ఆపరేషన్ గ్రూప్7, గోపాల్‌గంజ్ DIU, కుచయ్‌కోట్ పోలీస్ స్టేషన్‌ల సంయుక్త తనిఖీల్లో భాగంగా దీనిని పట్టుకున్నారు. వాహన తనిఖీల్లో భాగంగా భద్రతా బలగాలు ముగ్గురు అనుమానితులను కూడా అదుపులోకి తీసుకున్నారు. స్వాధీనం చేసుకున్న కాలిఫోర్నియం స్టోన్‌ నమూనాను పరీక్షల నిమిత్తం మద్రాస్‌ ఐఐటీకి పంపించారు. పోలీసులు డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీని సంప్రదించే పనిలో ఉన్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Published on: Aug 12, 2024 05:00 PM