ఫైవ్ స్టార్ హోటల్‌లో బాలుడి చోరీ.. రూ.1.50 కోట్లున్న బ్యాగ్‌తో పరార్ !!
రాజస్థాన్‌లోని జైపూర్‌లో తాజాగా షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఓ ఫైవ్ స్టార్ హోటల్‌లో జరుగుతున్న వివాహ వేడుకలో 14 ఏళ్ల బాలుడు భారీ చోరీకి పాల్పడ్డాడు. పెళ్లి కొడుకు తల్లికి చెందిన 1.50 కోట్ల రూపాయలున్న బ్యాగును ఎవరికీ అనుమానం రాకుండా ఎత్తుకెళ్లిపోయాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, హైదరాబాద్‌కు చెందిన యువకుడి వివాహ వేడుకను జైపూర్ లోని హోటల్ హయత్‌లో ఆగస్టు 8న ఏర్పాటు చేశారు.
రాజస్థాన్‌లోని జైపూర్‌లో తాజాగా షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఓ ఫైవ్ స్టార్ హోటల్‌లో జరుగుతున్న వివాహ వేడుకలో 14 ఏళ్ల బాలుడు భారీ చోరీకి పాల్పడ్డాడు. పెళ్లి కొడుకు తల్లికి చెందిన 1.50 కోట్ల రూపాయలున్న బ్యాగును ఎవరికీ అనుమానం రాకుండా ఎత్తుకెళ్లిపోయాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, హైదరాబాద్‌కు చెందిన యువకుడి వివాహ వేడుకను జైపూర్ లోని హోటల్ హయత్‌లో ఆగస్టు 8న ఏర్పాటు చేశారు. వరుడి తండ్రికి మెడికల్ బిజినెస్ ఉంది. పెళ్లి రోజున వరుడు తన కుటుంబసభ్యులతో కలిసి ఏనుగు మీద ఊరేగింపుగా హోటల్‌కు వెళ్లాడు. ఆ హడావుడిలో 14 ఏళ్ల బాలుడు, తన స్నేహితుడితో కలిసి ఎవరికీ అనుమానం రాకుండా ఊరేగింపుకు వచ్చిన పెళ్లివారితో కలిసి హోటల్‌లోకి చొరబడ్డాడు. అక్కడ నిందితులిద్దరూ పెళ్లి వేడుకకు వచ్చిన అతిథులను, వారి వస్తువులను జాగ్రత్తగా పరిశీలించారు. ఈ క్రమంలో పెళ్లి మండపం వద్ద ఉన్న వరుడి తల్లి.. రూ.1.50 కోట్ల నగదు ఉన్న బ్యాగును కింద పెట్టింది. ఇదే అదనుగా భావించిన మైనర్, బ్యాగును ఎవరికీ అనుమానం రాకుండా చాక చక్యంగా ఎత్తుకెళ్లిపోయాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. హోటల్‌లోని సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుల ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నాగుల పంచమి తెలుసు.. ఈ తేళ్ల పంచమి ఏంటి ??
ముఖంపై ముడతలా ?? ఇలా చేస్తే వారం రోజుల్లోనే మార్పు
విశాఖ-సికింద్రాబాద్ వందే భారత్.. రైలు షెడ్యూలులో మార్పు
ముఖం రంగు మారిందా.. బాబోయ్.. అస్సలు లేట్ చేయద్దు..!
సత్యదేవుని ధ్వజస్తంభం బంగారు తాపడానికి.. నెల్లూరు భక్తుడి భారీ విరాళం
ఆటోడ్రైవర్‌తో మహిళల ఫైట్.. నడిరోడ్డుపై జుట్టుపట్టి వీరంగం
పొలానికి వెళ్లిన రైతు.. దూరంగా కనిపించినది చూసి హడలిపోయి..
విషపూరిత పాములను చంపేందుకు తెచ్చిన ముంగీసల కథ..
ఇక ఇంటర్నెట్ లేకపోయినా ఫోన్లోనే లైవ్ టీవీ చూడొచ్చు!
ఏనుగునైనా చంపే కింగ్ కోబ్రా.. తన పిల్లల కోసం ఏం చేసిందో తెలుసా
మొక్కలకు నీళ్లు పోస్తున్న వ్యక్తి.. వెనుక ఏదో అలికిడి.. చూడగా
సినిమాకి వెళ్తే 22 నిమిషాలు యాడ్స్ వేస్తారా..?

