సత్యదేవుని ధ్వజస్తంభం బంగారు తాపడానికి.. నెల్లూరు భక్తుడి భారీ విరాళం
హిందువులు ఇంట్లో ఏ శుభకార్యం తలపెట్టినా సత్యనారాయణస్వామి వ్రతం తప్పనిసరిగా చేస్తారు. రత్నగిరిపై వెలసిన శ్రీ సత్యదేవుడు తెలుగు ప్రజల ఆరాధ్య దైవం. నిత్యం సత్యనారాయణస్వామి దర్శనానికి వివిధ ప్రాంతాలనుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తుంటారు. అన్నవరం శ్రీసత్యనారాయణస్వామి ఆలయంలో వ్రతాలు జరిపించుకుంటారు. స్వామి వారికి కానుకలు సమర్పిస్తారు.. అలాగే ఆలయ అభివృద్ధికి విరాళాలు కూడా సమర్పిస్తుంటారు.
హిందువులు ఇంట్లో ఏ శుభకార్యం తలపెట్టినా సత్యనారాయణస్వామి వ్రతం తప్పనిసరిగా చేస్తారు. రత్నగిరిపై వెలసిన శ్రీ సత్యదేవుడు తెలుగు ప్రజల ఆరాధ్య దైవం. నిత్యం సత్యనారాయణస్వామి దర్శనానికి వివిధ ప్రాంతాలనుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తుంటారు. అన్నవరం శ్రీసత్యనారాయణస్వామి ఆలయంలో వ్రతాలు జరిపించుకుంటారు. స్వామి వారికి కానుకలు సమర్పిస్తారు.. అలాగే ఆలయ అభివృద్ధికి విరాళాలు కూడా సమర్పిస్తుంటారు. తాజాగా నెల్లూరుకు చెందిన ఓ భక్తుడు స్వామివారికి భారీ విరాళం సమర్పించారు. ఆలయ ధ్వజస్తంభానికి బంగారు తాపడం చేయించారు. నెల్లూరుకు చెందిన ఓ దాత సహకారంతో సుమారు రెండు కోట్ల రూపాయిల ఖర్చుతో ధ్వజస్తంభానికి బంగారు తాపడంతో కవచాన్ని చేయించారు. 300 కేజీల రాగి, 1800 గ్రాముల బంగారంతో తయారుచేసిన ధ్వజస్తంభ కవచంపై అష్ట లక్ష్ములు, పంచాయతనాలు, దశావతారాల రూపాలను తీర్చిదిద్దారు. వైదిక బృందం ఆధ్వర్యంలో ధ్వజస్తంభానికి ప్రత్యేక పూజలు, సంప్రోక్షణ చేసిన అనంతరం ధ్వజస్తంభ ప్రదక్షణకు భక్తులను అనుమతించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మామకు తలకొరివి పెట్టిన కోడలు.. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఘటన
ఇంకెన్నాళ్లీ డోలీమోతలు ?? కనీస సౌకర్యాలు కల్పించాలని డిమాండ్
బైక్‌పై వెళ్తున్న దంపతులు.. కాటెయ్యకుండానే ప్రాణం తీసిన పాము