ఇంకెన్నాళ్లీ డోలీమోతలు ?? కనీస సౌకర్యాలు కల్పించాలని డిమాండ్
ఆగస్టు 9 అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా అనకాపల్లి జిల్లా గిరిజనులు వినూత్న నిరసన చేపట్టారు. అడ్డాకుల టోపీలు ధరంచి, గుర్రాలపై వెళ్తూ, డోలీలు మోస్తూ తమ నిరసన తెలిపారు. ఇంకెన్నాళ్లీ చీకటి బ్రతులు.. డోలీ మోతలు.. అంటూ తాగు నీరులేదు..నడవ దారిలేదు.. ఎన్ని ప్రభుత్వాలు మారినా మా తలరాతలు మారడంలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
ఆగస్టు 9 అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా అనకాపల్లి జిల్లా గిరిజనులు వినూత్న నిరసన చేపట్టారు. అడ్డాకుల టోపీలు ధరంచి, గుర్రాలపై వెళ్తూ, డోలీలు మోస్తూ తమ నిరసన తెలిపారు. ఇంకెన్నాళ్లీ చీకటి బ్రతులు.. డోలీ మోతలు.. అంటూ తాగు నీరులేదు..నడవ దారిలేదు.. ఎన్ని ప్రభుత్వాలు మారినా మా తలరాతలు మారడంలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమకు కరెంట్, నీరు, రోడ్డు సదుపాయం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. అనకాపల్లి జిల్లా గిరిజనులు భారీ ర్యాలీ చేపట్టారు. మూడు కిలోమీటర్లు కొండలు, గుట్టలు దాటుకుంటూ, గుర్రాలపై కొందరు, డోలీలు మోస్తూ కొందరు తమకు మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు. పశువుల బంద గ్రామం నుంచి తనిమాని జంక్షన్ వరకూ ర్యాలీ నిర్వహించారు. పివిటీజీ, కోందు గిరిజన గ్రామాల్లో కనీసం కరెంటు సదుపాయం కూడా లేదని చీకటిలోనే జీవనం సాగిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పాలకులారా ఇంకెన్నాళ్లు మాకు ఈ డోలీ మోతలు, చీకటి బతుకులు అంటూ నినాదాలు చేసారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బైక్‌పై వెళ్తున్న దంపతులు.. కాటెయ్యకుండానే ప్రాణం తీసిన పాము