మామకు తలకొరివి పెట్టిన కోడలు.. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఘటన
తెలుగు రాష్ట్రాలనుంచి చాలామంది బ్రతుకు తెరువుకోసం ఉన్న ఊరిని, కన్నవారిని వదిలి విదేశాలకు వెళ్లి అష్టకష్టాలు పడుతున్నారు. కన్నవారిని అవసాన దశలో కంటికి రెప్పలా చూసుకోవాల్సిన పిల్లలు ఆర్ధిక ఇబ్బందులతో పొట్టకూటి కోసం గుండె రాయి చేసుకొని విదేశాల్లో కష్టపడుతున్నారు. దారుణం ఏంటంటే.. కన్నవారిని కడసారి చూసుకునేందుకు కూడా కొందరు నోచుకోవడంలేదు.
తెలుగు రాష్ట్రాలనుంచి చాలామంది బ్రతుకు తెరువుకోసం ఉన్న ఊరిని, కన్నవారిని వదిలి విదేశాలకు వెళ్లి అష్టకష్టాలు పడుతున్నారు. కన్నవారిని అవసాన దశలో కంటికి రెప్పలా చూసుకోవాల్సిన పిల్లలు ఆర్ధిక ఇబ్బందులతో పొట్టకూటి కోసం గుండె రాయి చేసుకొని విదేశాల్లో కష్టపడుతున్నారు. దారుణం ఏంటంటే.. కన్నవారిని కడసారి చూసుకునేందుకు కూడా కొందరు నోచుకోవడంలేదు. పున్నామ నరకం నుంచి తప్పించడానికి పుత్రుడు తప్పక కావాలి అని తపించిన తల్లిదండ్రులకు ఆ భాగ్యం కూడా దక్కడం లేదు. అందుకు ఉదాహరణే ఈ ఘటన. కొడుకు బ్రతుకు తెరువుకోసం మస్కట్ వెళ్ళగా తండ్రి బ్రెయిన్ డెడ్‌తో మరణించాడు. అంతిమ సంస్కారాలు చేయాల్సిన కొడుకు స్థానంలో కోడలు నిలిచి మామకు తలకొరివి పెట్టిన ఘటన అంబేద్కర్ కోనసీమ జిల్లాలో చోటుచేసుకుంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం బి.దొడ్డవరం గ్రామంలో ఈ హృదయ విదారక ఘటన జరిగింది. గ్రామానికి చెందిన కేతా బాపూజీ అనే వ్యక్తి బ్రెయిన్ డెడ్ తో మృతి చెందాడు. ఇటీవలే బాపూజీ కొడుకు ఉపాధి కోసం మస్కట్‌కు వెళ్లాడు. ఓ వైపు తండ్రి మరణం, మరోవైపు పరాయిదేశం నుంచి అతను రాలేని పరిస్థితి. ఏం చేయాలో తెలియక తల్లడిల్లిపోయాడు బాపూజీ కుమారుడు. ఈ క్రమంలో బాపూజీ కోడలు దుర్గాభవాని కొడుకు స్థానంలో నిలబడి మామగారిని తండ్రిగా భావించి స్వయంగా పాడె మోసి, తలకొరివి పెట్టి అంతిమ సంస్కారం జరిపించింది. దుర్గా భవాని స్పందించిన తీరుపై ఆమె కుటుంబ సభ్యులు, గ్రామస్టులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఇంకెన్నాళ్లీ డోలీమోతలు ?? కనీస సౌకర్యాలు కల్పించాలని డిమాండ్
బైక్‌పై వెళ్తున్న దంపతులు.. కాటెయ్యకుండానే ప్రాణం తీసిన పాము
తెల్లవారేసరికి ఇళ్ల ముందు క్షుద్రపూజలు
లక్షల ఖర్చు లేదు.. రోడ్డుపైనే పెళ్లి.. వీడియో వైరల్!
తిరుమల గదిలో 9 అడుగుల జర్రిపోతు.. భక్తుల్లో భయం!
ప్రపంచ రికార్డు సృష్టించిన 13 రోజుల చిన్నారి
అర్థరాత్రి రోడ్డు దాటుతూ కనిపించిన వింత జీవి!
62 ఏళ్ల వయసులోనూ వర్కవుట్స్.. నీతా అంబానీ ఫిట్నెస్ రహస్యం ఇదే!
కదులుతున్న రైల్లోకి పార్శిల్ డెలివరీ.. వాటే టైమింగ్ బాస్!
అయ్యో.. ఈ భర్త కష్టం ఎవరికీ రాకూడదు!
హిట్టు కొడితే.. కోట్ల విలువ చేసే లగ్జరీ కార్ చేతిలో పడ్డట్టే..
బిగ్ బాస్ 10 - కామనర్స్ Vs సెలబ్రిటీస్ మధ్యలో మంట పెట్టిన మానస్
మహేష్ బాబు, రాజమౌళిలకు నోటీసులు..అసలేం జరిగిందంటే?
మీర్జాపూర్ ఊచకోత.. రూ.200 కోట్ల కలెక్షన్స్ దిశగా అడుగులు

