Rains in India: ‘ఎల్‌ నినో’ నిష్క్రమణ.. లా నినా ఎంట్రీ.. పుష్కలంగా వర్షాలు..

రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలతో పుడమిని ఉక్కిరిబిక్కిరి చేసిన సహజసిద్ధ ‘ఎల్‌ నినో’ ముగిసిపోతోందని ప్రపంచ వాతావరణ సంస్థ WMO తెలిపింది. దాని స్థానంలో జులై- సెప్టెంబరులో ‘లా నినా’ ఏర్పడటానికి అవకాశం ఉందని వివరించింది. దీనివల్ల రుతుపవనాల సీజన్‌లో మంచి వర్షాలు పడటానికి అవకాశం ఉంటుంది. ఈ ఏడాది ఏప్రిల్‌.. అత్యంత ఉష్ణమయ ఏప్రిల్‌గా రికార్డు సృష్టించింది. దానికి ముందు వరుసగా 10 నెలల్లోనూ అదే పరిస్థితి నెలకొందని WMO పేర్కొంది.

Rains in India: ‘ఎల్‌ నినో’ నిష్క్రమణ.. లా నినా ఎంట్రీ.. పుష్కలంగా వర్షాలు..

|

Updated on: Jun 06, 2024 | 8:05 PM

రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలతో పుడమిని ఉక్కిరిబిక్కిరి చేసిన సహజసిద్ధ ‘ఎల్‌ నినో’ ముగిసిపోతోందని ప్రపంచ వాతావరణ సంస్థ WMO తెలిపింది. దాని స్థానంలో జులై- సెప్టెంబరులో ‘లా నినా’ ఏర్పడటానికి అవకాశం ఉందని వివరించింది. దీనివల్ల రుతుపవనాల సీజన్‌లో మంచి వర్షాలు పడటానికి అవకాశం ఉంటుంది. ఈ ఏడాది ఏప్రిల్‌.. అత్యంత ఉష్ణమయ ఏప్రిల్‌గా రికార్డు సృష్టించింది. దానికి ముందు వరుసగా 10 నెలల్లోనూ అదే పరిస్థితి నెలకొందని WMO పేర్కొంది. గడిచిన 13 నెలల్లో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదయ్యాయని వివరించింది. ఇందుకు ప్రధాన కారణం ఎల్‌ నినో అని తెలిపింది. మధ్య, తూర్పు పసిఫిక్‌ మహాసముద్ర జలాలు అసాధారణ స్థాయిలో వేడెక్కడం వల్ల ఈ పరిస్థితి తలెత్తుతుంది. దీనికితోడు మానవ చర్యల వల్ల వాతావరణంలో, సాగరాల్లో పేరుకుపోయిన అదనపు శక్తి కూడా ఇందుకు కారణమని WMO పేర్కొంది.

బలహీనంగా ఉన్నప్పటికీ ఇంకా కొనసాగుతున్న ఎల్‌ నినో వల్ల భారత్, పాకిస్థాన్‌ సహా దక్షిణాసియాలో కోట్ల మంది ప్రజలు ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో తీవ్ర వేసవి తాపాన్ని ఎదుర్కొన్నారు. ఈ ఏడాది జూన్‌-ఆగస్టులో తటస్థ పరిస్థితులు నెలకొనడానికి గానీ లా నినా ఏర్పడటానికి గానీ అవకాశాలు 50 శాతం వరకూ ఉన్నాయని WMO వివరించింది. లా నినా తలెత్తడానికి జులై నుంచి సెప్టెంబరు మధ్య 60 శాతం, ఆగస్టు నుంచి నవంబరు మధ్య 70 శాతం మేర అవకాశాలు ఉన్నాయని తెలిపింది. ఎల్‌ నినో వల్ల భారత్‌లో వర్షాలు తక్కువగా పడతాయి. ఎక్కువగా పొడి వాతావరణం ఉంటుంది. లా నినా దీనికి పూర్తి భిన్నం. ఈ వాతావరణ పోకడ వల్ల వర్షాకాలంలో వానలు పుష్కలంగా పడతాయి. ఎల్‌ నినో ముగిసినప్పటికీ దీర్ఘకాల వాతావరణ మార్పులు ఆగిపోవని WMO డిప్యూటీ సెక్రటరీ జనరల్‌ కో బ్యారెట్‌ పేర్కొన్నారు. గ్రీన్‌హౌస్‌ వాయువుల కారణంగా పుడమి వేడెక్కడం కొనసాగుతుందన్నారు. గడిచిన 9 ఏళ్లు.. అత్యంత తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదైన కాలంగా నిలిచిపోయిందని గుర్తుచేశారు. 2020 నుంచి 2023 ప్రారంభం వరకూ లా నినా ఉన్నప్పటికీ ఈ పరిస్థితి నెలకొందని వివరించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!..

Follow us