AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

త్వరలో దేశవ్యాప్తంగా ప్లాస్టిక్‌ కరెన్సీ నోట్లు.. ఆర్‌బీఐ కీలక అడుగు!

త్వరలో దేశవ్యాప్తంగా ప్లాస్టిక్‌ కరెన్సీ నోట్లు.. ఆర్‌బీఐ కీలక అడుగు!

Phani CH
|

Updated on: Jun 03, 2026 | 4:28 PM

Share

దేశంలో ప్లాస్టిక్ లేదా పాలిమర్ కరెన్సీ నోట్ల ప్రవేశానికి ఆర్‌బీఐ మళ్లీ కసరత్తు ప్రారంభించింది. పెరుగుతున్న నగదు డిమాండ్, కరెన్సీ ముద్రణ వ్యయాలు, చిరిగిపోయిన నోట్ల సమస్యలను దృష్టిలో ఉంచుకుని పైలట్ ప్రాజెక్ట్ చేపట్టే యోచనలో ఉంది. కాగితపు నోట్లతో పోలిస్తే పాలిమర్ నోట్లు ఎక్కువకాలం మన్నడంతో పాటు నీరు, దుమ్ము ప్రభావానికి తట్టుకునే సామర్థ్యం కలిగి ఉంటాయి.

దేశంలో త్వరలోనే సరికొత్త ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు చలామణిలోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. మార్కెట్‌లో నగదుకు డిమాండ్ విపరీతంగా పెరుగుతుండటం, కాగితపు నోట్ల ముద్రణ భారం అవుతుండటంతో ‘రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’ ఈ దిశగా ముమ్మరంగా అడుగులు వేస్తోంది. ఇటీవల పాట్నా, ముంబై నగరాల్లో జరిగిన ఆర్‌బీఐ బోర్డు సమావేశాల్లో ప్లాస్టిక్ నోట్ల ప్రవేశంపై సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం. ప్రస్తుతం డిజిటల్ చెల్లింపులు పెరుగుతున్నప్పటికీ, మార్కెట్లో నగదు చలామణి రికార్డు స్థాయిలో రూ. 42.86 లక్షల కోట్లకు చేరింది. గత ఆర్థిక సంవత్సరంలో కరెన్సీ ముద్రణ కోసమే ఆర్‌బీఐ ఏకంగా రూ. 6,372.8 కోట్లు ఖర్చు చేయాల్సి వచ్చింది. దీనికి తోడు మార్కెట్లో పాడైపోయిన, చిరిగిపోయిన నోట్లను సేకరించి నిర్మూలించడం పెద్ద సవాలుగా మారింది. గత ఏడాదిలోనే ఆర్‌బీఐ దాదాపు 23.8 బిలియన్ల పాత నోట్లను వెనక్కి తీసుకుంది. కాగితపు నోట్లతో పోలిస్తే ప్లాస్టిక్ నోట్ల ముద్రణ ఖర్చు తక్కువగా ఉండటమే కాకుండా, ఇవి ఎక్కువ కాలం మన్నుతాయి. నీటిలో తడిసినా పాడవవు. గతంలో 2012లోనే ఐదు నగరాల్లో ప్రయోగాత్మకంగా రూ. 10 ప్లాస్టిక్ నోట్లను తేవాలని చూసినా, సాంకేతిక కారణాల వల్ల అది సాధ్యపడలేదు. అయితే ఇప్పుడు పూర్తిస్థాయి సాంకేతికత అందుబాటులోకి రావడంతో.. ఏటీఎం యంత్రాల్లో అవసరమైన మార్పులు చేసి, త్వరలోనే దేశంలోని కొన్ని ప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్ట్ కింద ప్లాస్టిక్ నోట్లను విడుదల చేయడానికి ఆర్‌బీఐ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఛీ.. ఛీ.. రైలు టాయిలెట్‌లో భోజన పాత్రలు కడిగిన IRCTC సిబ్బంది

Save The Tigers 3: ‘పెళ్లి తెచ్చిన తంటాలు..’కడుపుబ్బా నవ్విస్తున్న సేవ్ ది టైగర్స్ 3 ట్రైలర్‌

AR Rahman: నా కొడుకు కూడా రామ్ చరణ్‌లా ఉండాలి.. రెహమాన్

Janhvi Kapoor: దీపికాకు జాన్వీ సాలిడ్ కౌంటర్.. టాలీవుడ్‌ గురించి వాగితే ఇట్లే ఉంటది!

Satyadev: ‘రాజకీయాల గురించి మాట్లాడితే సినిమాకే పెద్ద నష్టం! నోరు మూసుకోవడం బెటర్!

Follow Us