గల్ఫ్ లో ఉద్యోగమా? ఈ లెక్కలు, చిక్కులు చూడండి !!

మీ వాడు ఎక్కడ పనిచేస్తున్నాడురా.. గల్ఫ్ లో అన్న అంటారు. మీ నాన్నగారు ఎక్కడ వర్క్ చేస్తున్నారమ్మా అంటే.. గల్ఫ్ లో అంకుల్ అంటూ చాలామంది సమాధానం చెబుతారు. అయినా ఇదేమీ ఒక్కరి కథ కాదు. ఒక్కరి వ్యథా కాదు. దాదాపు కోటి మంది బతుకు చిత్రం. మన దేశంలో ఎక్కువమంది గల్ఫ్ దేశాలకు వలస పోతున్నారు. ఈ స్థాయిలో ఎందుకు వలసలు ఉంటున్నాయి? అంటే అక్కడ ఎక్కువ జీతాలు ఇస్తున్నారా? మెరుగైన సౌకర్యాలు, జీవన ప్రమాణాలు ఉన్నాయా?

గల్ఫ్ లో ఉద్యోగమా? ఈ లెక్కలు, చిక్కులు చూడండి !!

|

Updated on: Jun 21, 2024 | 7:48 PM

మీ వాడు ఎక్కడ పనిచేస్తున్నాడురా.. గల్ఫ్ లో అన్న అంటారు. మీ నాన్నగారు ఎక్కడ వర్క్ చేస్తున్నారమ్మా అంటే.. గల్ఫ్ లో అంకుల్ అంటూ చాలామంది సమాధానం చెబుతారు. అయినా ఇదేమీ ఒక్కరి కథ కాదు. ఒక్కరి వ్యథా కాదు. దాదాపు కోటి మంది బతుకు చిత్రం. మన దేశంలో ఎక్కువమంది గల్ఫ్ దేశాలకు వలస పోతున్నారు. ఈ స్థాయిలో ఎందుకు వలసలు ఉంటున్నాయి? అంటే అక్కడ ఎక్కువ జీతాలు ఇస్తున్నారా? మెరుగైన సౌకర్యాలు, జీవన ప్రమాణాలు ఉన్నాయా? మరెందుకు వెళుతున్నారు అన్నదే ముఖ్యం. అయినా ఇలా వెళ్లడం అనేది నిన్నో మొన్నో స్టార్టయింది కాదు. ఈ వలసలకు దాదాపు అర్థ శతాబ్దం చరిత్రుంది. వాళ్లు అక్కడి నుంచి మన దేశానికి పంపించే డబ్బూ తక్కువ కాదు. బిలియన్ డాలర్ల కథ ఉంది. గల్ఫ్ దేశాలలో ఒమన్, సౌదీ అరేబియా, కువైట్, బహ్రెయిన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతార్.. ఈ ఆరు దేశాలు కలిసి 1981లో ఓ కౌన్సిల్ గా ఏర్పడ్డాయి. దాని పేరు గల్ఫ్ కో ఆపరేషన్ కౌన్సిల్. సింపుల్ గా చెప్పాలంటే జీసీసీ. ఈ దేశాలకు వలస వెళ్లిన మనవారి సంఖ్య తక్కువేమీ కాదు. ప్రభుత్వ లెక్కల ప్రకారమే దాదాపు 90 లక్షల మంది ఉన్నారు. ఈ దేశాలలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోనే ఎక్కువమంది వలస శ్రామికులు ఉన్నారు. మన వారితో పాటు మన ఇరుగుపొరుగు దేశాల నుంచీ జీసీసీ దేశాలకు వలస వెళ్తుంటారు. ఇందులో కువైట్ కే తాకిడి ఎక్కువగా ఉంటుంది. అక్కడ మనవాళ్లు సుమారు 10 లక్షల మంది ఉంటారు. ఇక జీసీసీ దేశాలకు కేరళ, గోవా నుంచి ఎక్కువగా వలసలు ఉంటాయని చెప్పాలి.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

‘స్కిన్‌ బ్యాంక్‌’.. దేశంలో తొలిసారి అందుబాటులోకి

పిల్లలకు లంచ్ బాక్స్ లో ఏం పెట్టాలి ?? హెల్దీ ఫుడ్‌ ఇలానే మేలు

త్వరలో.. రోజుకు 25 గంటలు !! వాతావరణంలో వేగంగా సంభవిస్తున్న మార్పులు

రైల్వే ట్రాక్‌పై విశ్రాంతి తీసుకుంటున్న పది సింహాలు.. ఒక్క సారిగా వచ్చిన రైలు.. చివరికి ??

45 లక్షల విలువైన కారు కొన్న జబర్దస్త్‌ బ్యూటీ

Follow us
చిమ్మచీకట్లో నల్లటి ఆకారాలు.. ఏంటని దగ్గరకెళ్లి చూడగా..
చిమ్మచీకట్లో నల్లటి ఆకారాలు.. ఏంటని దగ్గరకెళ్లి చూడగా..
ఏరా.! మీరు మారరా.? ఇతడు ఏం చేశాడో తెలిస్తే
ఏరా.! మీరు మారరా.? ఇతడు ఏం చేశాడో తెలిస్తే
ఇంకా స్పేస్‌లోనే సునీతా విలియమ్స్ తిరిగొచ్చేదెప్పుడు.?
ఇంకా స్పేస్‌లోనే సునీతా విలియమ్స్ తిరిగొచ్చేదెప్పుడు.?
దారుణం.. మిస్టర్ తెలంగాణ సోహైల్ మృతి. బైక్‌పై వెళ్తూ..
దారుణం.. మిస్టర్ తెలంగాణ సోహైల్ మృతి. బైక్‌పై వెళ్తూ..
EPFO కీలక అప్‌డేట్‌.. ఫైనల్‌ సెటిల్‌మెంట్‌ చేసుకున్న వారికి ఆఫర్.
EPFO కీలక అప్‌డేట్‌.. ఫైనల్‌ సెటిల్‌మెంట్‌ చేసుకున్న వారికి ఆఫర్.
3.5 ఎకరాల్లో ఒక్కటే మర్రి చెట్టు.. శతాబ్దాల చెట్టుకు పునరుజ్జీవం.
3.5 ఎకరాల్లో ఒక్కటే మర్రి చెట్టు.. శతాబ్దాల చెట్టుకు పునరుజ్జీవం.
అండమాన్‌లో తెలుగు వారిపై లాఠీ చార్జ్.. పలువురికి గాయాలు.
అండమాన్‌లో తెలుగు వారిపై లాఠీ చార్జ్.. పలువురికి గాయాలు.
ఉదయం బ్రేక్‌ ఫాస్ట్‌గా ఇవి తీసుకుంటే అలసట దూరం., మీ గుండె పదిలం.!
ఉదయం బ్రేక్‌ ఫాస్ట్‌గా ఇవి తీసుకుంటే అలసట దూరం., మీ గుండె పదిలం.!
భాగ్యనగరంలో భారీ వర్షం.. వరదలో కారు ఎలా కొట్టుకుపోతుందో చూడండి
భాగ్యనగరంలో భారీ వర్షం.. వరదలో కారు ఎలా కొట్టుకుపోతుందో చూడండి
ప్రేమ పేరుతో వేధింపులు యువతి ఆత్మహత్య.! ఫొటోస్ పెడతానంటూ..
ప్రేమ పేరుతో వేధింపులు యువతి ఆత్మహత్య.! ఫొటోస్ పెడతానంటూ..