‘స్కిన్ బ్యాంక్’.. దేశంలో తొలిసారి అందుబాటులోకి
కాలిన గాయాలు, గ్రహణం మొర్రి, తెగిన చేతులు, వేళ్లు అతికించడం ఇతర చికిత్సలకు.. చర్మం అవసరం. రోగి శరీరంలోని కాళ్లు, చేతులు, తొడలు తదితర భాగాల నుంచి చర్మం సేకరించి గ్రాఫ్టింగ్ ద్వారా గాయాలైన చోట అమర్చుతున్నారు. అయితే.. రోగి శరీరం నుంచి 15-20 శాతం మాత్రమే ఇలా సేకరించడానికి వీలవుతుంది. అంతకంటే ఎక్కువ కావాల్సి వచ్చినప్పుడు అందుబాటులో ఉండటం లేదు.
కాలిన గాయాలు, గ్రహణం మొర్రి, తెగిన చేతులు, వేళ్లు అతికించడం ఇతర చికిత్సలకు.. చర్మం అవసరం. రోగి శరీరంలోని కాళ్లు, చేతులు, తొడలు తదితర భాగాల నుంచి చర్మం సేకరించి గ్రాఫ్టింగ్ ద్వారా గాయాలైన చోట అమర్చుతున్నారు. అయితే.. రోగి శరీరం నుంచి 15-20 శాతం మాత్రమే ఇలా సేకరించడానికి వీలవుతుంది. అంతకంటే ఎక్కువ కావాల్సి వచ్చినప్పుడు అందుబాటులో ఉండటం లేదు. ఈ నేపథ్యంలో ఏర్పాటైందే స్కిన్ బ్యాంకు. భారత సైన్యం మొట్టమొదటిసారి ‘చర్మనిధి కేంద్రాన్ని ప్రారంభించింది. ఆర్మీ సిబ్బందికి, వారి కుటుంబ సభ్యులకు కాలిన గాయాలు, ఇతర చర్మ సంబంధిత చికిత్సల్లో విప్లవాత్మక మార్పులు తీసుకురావడమే లక్ష్యంగా దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు రక్షణశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ఢిల్లీలోని ఆర్మీ హాస్పిటల్ – పరిశోధన, రెఫరల్ లో స్కిన్ బ్యాంకును ఏర్పాటు చేశారు. ప్లాస్టిక్ సర్జన్లు, ప్రత్యేక సాంకేతిక నిపుణులు సహా అత్యున్నత స్థాయి వైద్య బృందం ఇక్కడ అందుబాటులో ఉంటుంది. చర్మ సేకరణ, ప్రాసెసింగ్, నిల్వ, పంపిణీకి ఈ స్కిన్ బ్యాంకు హబ్‌గా పనిచేస్తుందని, అవసరమైన సందర్భాల్లో దేశవ్యాప్తంగా ఉన్న సైనిక వైద్య కేంద్రాలకు చేరవేస్తుందని రక్షణశాఖ వెల్లడించింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పిల్లలకు లంచ్ బాక్స్ లో ఏం పెట్టాలి ?? హెల్దీ ఫుడ్ ఇలానే మేలు
త్వరలో.. రోజుకు 25 గంటలు !! వాతావరణంలో వేగంగా సంభవిస్తున్న మార్పులు
రైల్వే ట్రాక్‌పై విశ్రాంతి తీసుకుంటున్న పది సింహాలు.. ఒక్క సారిగా వచ్చిన రైలు.. చివరికి ??
45 లక్షల విలువైన కారు కొన్న జబర్దస్త్ బ్యూటీ
కల్కిపై నెగెటివ్ కామెంట్స్ చేసిన యూట్యూబర్.. ఓ ఆట ఆడుకున్న విశ్వక్