రైల్వే ట్రాక్‌పై విశ్రాంతి తీసుకుంటున్న పది సింహాలు.. ఒక్క సారిగా వచ్చిన రైలు.. చివరికి ??
గుజరాత్‌లోని అమ్రేలీ జిల్లా పిపవవ్ పోర్టు సమీపంలో గూడ్సు రైలు డ్రైవర్ సమయస్ఫూర్తి పది సింహాల ప్రాణాలను కాపాడింది. రైల్వే ట్రాక్‌పై పడుకుని ఉన్న పది సింహాలను చూసిన ఇంజన్ డ్రైవర్ వెంటనే అలర్ట్ అయ్యారు. ఎమర్జెన్సీ బ్రేకులు వేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. సోమవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో రైలు డ్రైవర్ ముఖేష్ కుమార్ మీనాపై ప్రశంసల వెల్లువ కురుస్తోంది.
గుజరాత్‌లోని అమ్రేలీ జిల్లా పిపవవ్ పోర్టు సమీపంలో గూడ్సు రైలు డ్రైవర్ సమయస్ఫూర్తి పది సింహాల ప్రాణాలను కాపాడింది. రైల్వే ట్రాక్‌పై పడుకుని ఉన్న పది సింహాలను చూసిన ఇంజన్ డ్రైవర్ వెంటనే అలర్ట్ అయ్యారు. ఎమర్జెన్సీ బ్రేకులు వేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. సోమవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో రైలు డ్రైవర్ ముఖేష్ కుమార్ మీనాపై ప్రశంసల వెల్లువ కురుస్తోంది. పిపవవ్ పోర్టు స్టేషన్ నుంచి ప్రధాన కారిడార్‌కు పక్కన చిన్న ట్రాక్‌లోకి గూడ్సు రైలును తీసుకువెళుతుండగా ఈ ఘటన జరిగినట్లు పశ్చిమ రైల్వే భావ్‌నగర్ డివిజన్ ఒక ప్రకటనలో తెలిపింది. రైలు ట్రాక్‌పై విశ్రాంతి తీసుకుంటున్న సింహాలను చూసిన వెంటనే ముఖేష్ ఎమర్జెన్సీ బ్రేకులు వేయడంతో పాటు, సింహాలు అక్కడినుంచి లేచి వెళ్లిపోయేంత వరకు వేచి చూశారట. ఈ ఘటనపై స్పందించిన పశ్చిమ రైల్వే .. సింహాలు, ఇతర వన్యప్రాణుల భద్రత కోసం భావ్‌నగర్ డివిజన్ అన్ని విధాలుగా కృషి చేస్తుందని రైల్వే ట్రాక్‌పై నడచి వెళ్లే వన్యప్రాణుల పట్ల లోకో పైలట్లు అప్రమత్తంగా ఉంటారని తెలిపింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
45 లక్షల విలువైన కారు కొన్న జబర్దస్త్ బ్యూటీ
కల్కిపై నెగెటివ్ కామెంట్స్ చేసిన యూట్యూబర్.. ఓ ఆట ఆడుకున్న విశ్వక్