కల్కిపై నెగెటివ్ కామెంట్స్ చేసిన యూట్యూబర్.. ఓ ఆట ఆడుకున్న విశ్వక్
టాలీవుడ్ యంగ్ హీరో, మాస్ కా దాస్ విశ్వక్‍సేన్ గురించి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఏ విషయమైనా ముక్కుసూటిగా మాట్లాడడం అతని స్టైల్. ఏదైనా నచ్చకపోతే తన స్టైల్‌లోనే స్పందిస్తుంటాడు.అలా కొన్ని సార్లు విశ్వక్ సేన్ చేసిన కామెంట్లు కాంట్రవర్సీలకు కూడా దారి తీశాయి. ఇక తాజాగా మరోసారి ఓ యూట్యూబర్‌పై విరుచుకుపడ్డాడు విశ్వక్ సేన్. ప్రభాస్ నటించిన కల్కి సినిమాపై నెగెటివ్ కామెంట్స్ చేసిన ఆ యూబ్యూబర్ ను ఒక ఆటాడుకున్నాడు.
టాలీవుడ్ యంగ్ హీరో, మాస్ కా దాస్ విశ్వక్‍సేన్ గురించి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఏ విషయమైనా ముక్కుసూటిగా మాట్లాడడం అతని స్టైల్. ఏదైనా నచ్చకపోతే తన స్టైల్‌లోనే స్పందిస్తుంటాడు.అలా కొన్ని సార్లు విశ్వక్ సేన్ చేసిన కామెంట్లు కాంట్రవర్సీలకు కూడా దారి తీశాయి. ఇక తాజాగా మరోసారి ఓ యూట్యూబర్‌పై విరుచుకుపడ్డాడు విశ్వక్ సేన్. ప్రభాస్ నటించిన కల్కి సినిమాపై నెగెటివ్ కామెంట్స్ చేసిన ఆ యూబ్యూబర్ ను ఒక ఆటాడుకున్నాడు. ఇక ఇదే విషయమై తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ లో ఒక స్టోరీ పోస్ట్ చేసిన విశ్వక్… సినిమాలు రిలీజ్ కూడా అవకముందే చెంబులు పట్టుకొని బయలుదేరుతున్నారంటూ ఆ యూట్యూబర్‌పై సెటైర్ వేశాడు. అంతేకాదు యూట్యూబ్‍లో మీ ఆదాయం పెంచుకోవడం కోసం వేల కుటుంబాలు నడుస్తున్న సినిమా ఇండస్ట్రీతో మజాక్‍లు ఆడుతున్నారన్నాడు. వీడు ఒక పది నిమిషాల షార్ట్ ఫిల్మ్ తీస్తే చూద్దాం.. లేదంటే అడ్రస్ తప్పిపోయిన వాళ్లు అనుకుని ఇగ్నోర్ చేద్దాం.. ఇలా విమర్శలు చేసే వారంతా కూడా ఓ పది నిమిషాల షార్ట్ ఫిల్మ్ తీయండి అంటూ మీమర్స్‌కు ట్రోలర్స్‌కు సవాళ్లు విసిరాడు. అప్పుడు మీకు, మీ ఒపీనియన్‍కు కాస్త గౌరవం ఉంటుందని.. మన చుట్టూ ఉన్న కొంత మంది పైరసీ కంటే డేంజరని సినిమా రిలీజ్ కాకముందే ఫేక్ రివ్యూలిచ్చే వారిపై స్ట్రాంగ్ కామెంట్స్ చేశాడు విశ్వక్. అంతేకాదు వీడియో చివర్లో… సినిమా కోసం ఇక్కడ చిందించే రక్తం, చెమటను, ఎంతో మందికి జోవనోపాధిని ఇస్తున్న ఈ ఇండస్ట్రీని అందరూ అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను’ అంటూ ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ తన సెటైరిలక్ ఇన్‌స్టా స్టేటస్‌తో నెట్టింట వైరల్ అవుతున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అమరుడైన తండ్రికి చిన్నారి వాయిస్ మెసేజ్‌లు
Ganga River: రూటు మార్చిన గంగా నది .. కారణమేంటంటే ??
సబ్బులు, హెయిర్ ఆయిల్స్ ధరలు పైపైకి
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

