North Korea-Ukraine: వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!

North Korea-Ukraine: వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!

Anil kumar poka

|

Updated on: Dec 27, 2024 | 6:32 PM

ఉక్రెయిన్‌పై జరుగుతోన్న యుద్ధంలో రష్యాకు మద్దతుగా ఉత్తరకొరియా సైన్యాన్ని పంపింది. ఈ క్రమంలో ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఓ ప్రకటన చేశారు. ఈ పోరులో కిమ్‌ సైనికులు భారీ సంఖ్యలో మరణించడం లేదా తీవ్రంగా గాయపడటమో జరిగిందని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ప్రకటించారు. తాజాగా దాన్ని రుజువు చేసేలా ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. అందులో ఉక్రెయిన్‌ ప్రయోగించిన డ్రోన్ల ను ఎదుర్కోలేక కిమ్‌ సైన్యం పరుగులు పెడుతున్నట్టు కనిపిస్తోంది.

కీవ్‌కు చెందిన స్పెషల్‌ ఆపరేషన్స్‌ ఫోర్సెస్‌ ఈ వీడియోను విడుదల చేసినట్లు తెలుస్తోంది. రష్యా లోని కుర్స్క్‌ సరిహద్దు ప్రాంతాల్లో మోహరించిన ఉత్తర కొరియా జవాన్లను ఉక్రెయిన్‌ బలగాలు కమికేజ్ డ్రోన్లు వేటాడాయి. గత మూడు రోజుల్లో ఈ డ్రోన్లు 77 మంది కొరియన్‌ సైనికులను చంపేసినట్లు పేర్కొన్నాయి. అయితే, దీనిపై అటు రష్యా గానీ..ఇటు కిమ్‌ ప్రభుత్వం గానీ ఇంతవరకూ స్పందించలేదు. ఉక్రెయిన్‌ చొరబాటును అరికట్టేందుకు ప్రయత్నిస్తోన్న రష్యా , సరిహద్దు ప్రాంతమైన కుర్స్క్‌లో భారీస్థాయిలో సైన్యాన్ని మోహరించింది. ఇందులోభాగంగా మూడు గ్రామాల్లో దాదాపు 10వేల మంది కిమ్‌ సైనికులు పోరాడుతున్నారు. తొలుత వీరికి ప్రత్యేక శిక్షణ ఇప్పించిన అనంతరం యుద్ధానికి పంపారు. అయినప్పటికీ భాష సమస్య కారణంగా మాస్కో, కొరియన్‌ సేనల మధ్య సమన్వయం లోపించి ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు కథనాలు వచ్చాయి. తొలి వారాల్లోనే ప్రతి పదిమంది కిమ్‌ సైనికుల్లో ఒకరు ప్రాణాలు కోల్పోయారని దక్షిణ కొరియా తెలిపింది. యుద్ధంలో పోరాడే శక్తి కిమ్‌ దళాలకు లేకపోవడంతో ప్రాణ నష్టం ఎక్కువగా ఉంటోందని అమెరికా సైతం అభిప్రాయం వ్యక్తంచేసింది. ఇప్పటి వరకు వేల మంది కొరియన్‌ సైనికులు చనిపోయి ఉండడమో లేదా గాయపడడమో జరిగిందని జెలెన్‌స్కీ వెల్లడించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.