Gajuwaka: ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగిన హ్యుందాయ్ కారు.. అనుమానమొచ్చి లోపల చెక్ చేయగా!

ఎలక్షన్ కోడ్ కొనసాగుతుండటంతో పోలీసులు రాష్ట్రమంతటా ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. అన్ని చోట్లా ప్రత్యేక చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి.. ప్రతీ ఒక్క వాహనాన్ని ఆపి మరీ క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు పోలీసులు. రూ. 50 వేల కంటే ఎక్కువ నగదు.. సరైన డాక్యుమెంట్స్ లేకుండా దొరికితే.. ఆ తర్వాత ఏం జరిగిందంటే.?

Follow us
Ravi Kiran

|

Updated on: Mar 30, 2024 | 8:35 PM

ఎలక్షన్ కోడ్ కొనసాగుతుండటంతో పోలీసులు రాష్ట్రమంతటా ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. అన్ని చోట్లా ప్రత్యేక చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి.. ప్రతీ ఒక్క వాహనాన్ని ఆపి మరీ క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు పోలీసులు. రూ. 50 వేల కంటే ఎక్కువ నగదు.. సరైన డాక్యుమెంట్స్ లేకుండా దొరికితే.. వాటిని సీజ్ చేసి గ్రీవెన్స్ సెల్‌కి తరలిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా విశాఖపట్నం జిల్లాలోని గాజువాక తనిఖీలు చేసిన పోలీసులు భారీగా నగదును పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. గాజువాకలోని శ్రీహరిపురంలో ఐదు లక్షల నగదు పట్టుబడింది. అధికారులు వాహనాలు తనిఖీలు చేస్తుండగా.. AP 07BE 0369 నెంబరు గల కారు అనుమానాస్పదంగా కనిపించింది. ఆపి వెరిఫై చేసేసరికి అందులో.. రూ. 5 లక్షల నగదు తరలిస్తున్నట్లు గుర్తించారు. సరైన పత్రాలు చూపించకపోవడంతో నగదును స్వాధీనం చేసుకున్నారు. కారులో ప్రయాణిస్తున్న శశి రాజన్ సింగ్ అనే వ్యక్తిని విచారిస్తున్నారు.